BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ న్యూఇయర్‌ బంపర్‌ ఆఫర్.. రూ.277 రీఛార్జీ ప్యాక్‌తో 2 నెలల వ్యాలిడిటీ ఇతర బెనిఫిట్స్‌..

BSNL New Year Offer: నిన్న జియో యూజర్లకు బిగ్‌ షాక్‌ ఇచ్చింది. వోచర్ రీఛార్జ్ ప్యాక్‌ల వ్యాలిడిటీ తగ్గించింది. అయితే, కొత్త ఏడాది సందర్భంగా బిఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.. వినియోగదారులకు కొత్త ప్యాక్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది బీఎస్‌ఎన్‌ఎల్‌. కేవలం రూ.277 ప్యాక్‌తో 60 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. దీంతో పాటు ఇతర బెనిఫిట్స్‌ కూడా అదనంగా పొందుతారు. ఈ ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్ (BSNL) ప్రభుత్వ రంగ కంపెనీ. జియో, ఎయిర్టెల్ కు గట్టి పోటీ ఇచ్చేందుకు కొత్త రీఛార్జి ప్యాక్లను అందుబాటులోకి తీసుకు వస్తుంది. ఈ క్రమంలో బిఎస్ఎన్ఎల్ 4g, 5g సేవలను కూడా దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది.  

2 /5

అయితే కొత్త సంవత్సరం సందర్భంగా ఈ ప్రభుత్వం రంగ కంపెనీ మరో కొత్త ఆఫర్‌ను కస్టమర్ల కోసం పరిచయం చేసింది. కేవలం రూ. 277 తో 60 రోజుల వాలిడిటీ అందిస్తోంది. ఇప్పటివరకు ఏ టెలికాం కంపెనీ ఈ ఆఫర్ ను ప్రకటించలేదు.  

3 /5

రూ. 277 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే ప్రతిరోజు 2జీబీ డేటా కూడా ఉచితంగా పొందుతారు. అంతేకాదు డేటా పరిమితి ముగిసిన తర్వాత 40 కేబీపీఎస్ నెట్ పొందుతారు. పూర్తిగా ఇంటర్నెట్‌ జీరో అవ్వదు.  

4 /5

ఈ ప్లాను న్యూ ఇయర్ ఆఫర్‌ ప్రకటిస్తున్నట్టు ఎక్స్ వేదికగా బిఎస్ఎన్ఎల్ ప్రకటించింది. అయితే ఈ ప్లాన్ కేవలం 2025 జనవరి 16 లోపు మాత్రమే అందుబాటులో ఉంది. ఈలోగా రీఛార్జీ చేసుకున్నవారికి మాత్రమే వర్తిస్తుంది.  

5 /5

పెరిగిన టెలికాం ధరలో తర్వాత బిఎస్ఎన్ఎల్ ఇతర ప్రైవేట్ దిగ్గజ కంపెనీలకు పోటీ ఇచ్చేలా కొత్త ఆఫర్లు ప్రకటిస్తుంది.. ఇప్పటికే ఎంతో మంది కస్టమర్లను కోల్పోయిన జియో, ఎయిర్టెల్ కు ఇలాంటి కొత్త ఆఫర్లను ప్రకటిస్తూ గట్టి పోటీ ఇస్తుంది బిఎస్ఎన్ఎల్. జూలై నెలలో బిఎస్ఎన్ఎల్ కు కనీవినీ ఎరుగని రీతిలో సబ్స్క్రైబర్లు చేరారు. మరోవైపు ఎయిర్టెల్ జియో లక్షలమందిలో సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది