Tirumala Vaikunta Ekadasi: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని 2025 జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు పది రోజుల పాటు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ శ్యామల రావు ప్రకటించారు. భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం త్వరగా జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా భక్తుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
Also Read: JC Prabhakar Reddy: ఎవరికీ భయపడను. ఇంట్లో ఉండే పెరుగన్నం తిని బతుకుతా
అలహాబాద్ కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయం రూపొందిస్తున్నట్లు టీటీడీ ఈవో జె శ్యామల రావు వెల్లడించారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా భక్తులకు టైంస్లాట్ టోకెన్లు జారీ చేస్తామని ప్రకటించారు. 1.40 లక్షల మందికి రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను డిసెంబరు 24న విడుదల చేశామని.. శ్రీవాణి దర్శన టికెట్లు జనవరి 10న 1,500, మిగిలిన 9 రోజులకు 2 వేల టికెట్లు, గదుల కోటాను డిసెంబరు 23న విడుదల చేసినట్లు వివరించారు. ఈ టికెట్లను పొందిన భక్తులకు మహాలఘు దర్శనం ఉంటుందని చెప్పారు.
Also Read: YS Jagan: 'ఎవరూ అధైర్యపడొద్దు.. మంచి రోజులు వస్తాయి' మాజీ సీఎం జగన్ భరోసా
సామాన్య భక్తుల సౌకర్యార్థం జనవరి 8 నుంచి 11వ తేదీ వరకు దాతలకు గదుల కేటాయింపు ఉండదని ఈవో శ్యామలరావు స్పష్టం చేశారు. మిగతా రోజుల్లో దాతలు యథావిధిగా గదులు బుక్ చేసుకోవచ్చని చెప్పారు. తిరుపతిలోని 8 కేంద్రాలలో 87 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 91 కౌంటర్ల ద్వారా టోకెన్లు మంజూరు చేస్తామని చెప్పారు.
టోకెన్ల జారీ
జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి మొదటి మూడు రోజులకు జనవరి 9వ తేదీన ఉదయం 5 గంటల నుంచి 1.20 లక్షల టోకెన్లు జారీ చేస్తాం.
13 నుంచి 19వ తేదీ వరకు ఏ రోజుకారోజు ముందు రోజు భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసంలో టోకెన్లు జారీ చేస్తాం.
కౌంటర్లు ఏర్పాటు చేస్తున్న ప్రాంతాల్లో భక్తులకు ప్రత్యేకంగా క్యూలైన్లు, బారీకేడ్లు, తాగునీరు, మరుగుదొడ్లు తదితర సదుపాయాలు కల్పిస్తున్నాం.
సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు తమకు కేటాయించిన సమయానికి తిరుమలకు వచ్చి స్వామివారి దర్శించుకోవాలని ఈఓ శ్యామలరావు విజ్ఞప్తి చేశారు. గోవిందమాల భక్తులు కూడా దర్శన టోకెన్లు పొంది దర్శనానికి రావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దర్శన టోకెన్లు గల భక్తులను మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. భక్తుల అధిక రద్దీ దృష్ట్యా ఈ 10 రోజులలో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించలేమని ప్రకటించారు.
వైకుంఠ ఏకాదశికి స్వామి దర్శనం
- జనవరి 10న వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు.
- జనవరి 11న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 5.30 నుంచి 6.30 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తాం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook