ఆంధ్ర ప్రదేశ్ లో ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ (ఐఈఏ) సమ్మిట్ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలో ఉన్న బైబిల్ మిషన్ గ్రౌండ్స్ లో వేడుకలు అట్టహాసంగా మొదలయ్యాయి. నేటి నుంచి నాలుగురోజులపాటు జరిగే ఈ ఉత్సవాలను ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేడు అమరావతికి వచ్చిన రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ శతాబ్ది ఉత్సవాలను జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆర్బీఐ మాజీ గవర్నర్ రంగరాజన్, ఐఈఏ సుఖ్దేవ్ సింగ్ థోరాట్, తదితరులు హాజరయ్యారు. సదస్సుకు దేశ విదేశాల నుంచి ఆర్థికవేత్తలు, ప్రతినిధులు హాజరయ్యారు. నోబెల్ గ్రహీత, బంగ్లా ఆర్థికవేత్త మహమ్మద్ యూనిస్, 16 దేశాల నుంచి వచ్చిన 60 మంది ఆర్థిక శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.


రాష్ట్రపతి స్పీచ్ హైలెట్స్: 


* సదస్సులు దేశ ఆర్థికప్రగతికి ఎంతో సహకారం అందించాయి.


* ఆలోచనలు విన్నూతంగా ఉండాలి. ఉపఖండంలో మహమ్మద్ యూనిస్ ఆలోచన కొత్త మార్పులు తెచ్చింది.


* కీలక ఆర్థిక సంస్కరణల్లో ఐఈఏ సభ్యులే భాగస్వామ్యం వహించారు.


*  సామాజిక, ఆర్థిక అసమానలతను తొలగించాల్సిన అవసరం ఉంది.


* భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా ఎదుగుతోంది.


* అర్థశాస్త్రం అనేక శాస్త్రాలను తనలో ఇముడ్చుకుంది. ఈ శాస్త్రం ఒక నదీ ప్రవాహం లాంటిది. 


* పేదరికంలో మగ్గుతున్న కొన్ని వర్గాలపై ముందుకు వచ్చి చర్చలు జరపాలి. ఆర్థికవేత్తలు సమిష్టిగా నిర్ణయం తీసుకొని సూచనలు చేయాలి. 


కాగా, సదస్సు ముగింపు ఉత్సవాలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హాజరవుతారు.