Road Accident: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళా కూలీలు దుర్మరణం
Road Accident: ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మహిళా కూలీలు మృతి చెందారు. ఈ ప్రమాదం గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
Guntur Road Accident: ఏపీలోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళా కూలీలు(Women laborers) దుర్మరణం చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.ఈ ప్రమాదం యడ్లపాడు 16వ నెంబర్ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే...
చిలకలూరిపేట పట్టణంలోని మద్దినగర్, వడ్డెర కాలనీలకు చెందిన 14 మంది మహిళా కూలీలు పత్తిపాడు మండలం తుమ్మలపాలెంలో పత్తి తీత పనులకు ఆటో(Auto)లో ఉదయాన్నే బయలుదేరారు. ఈ క్రమంలో యడ్లపాడు వద్దకు రాగానే ఆటోను.. వెనుక నుంచి వచ్చిన ఓ గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆటో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తొమ్మిది మందిని స్థానికుల సహాయంతో పోలీసులు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు కూలీలు మరణించారు. మృతులను షేక్ దరియాబి (55), బేగం (52) గా గుర్తించారు. ఈ ఘటనపై యడ్లపాడు పోలీసులు(Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read: Guntur: బొడ్డు పేగు తిని వివాహిత మృతి-సంతానం కలుగుతుందన్న మూఢనమ్మకంతో...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook