Guntur: బొడ్డు పేగు తిని వివాహిత మృతి-సంతానం కలుగుతుందన్న మూఢనమ్మకంతో...

Woman eats umbilical cord to get pregnancy: బొడ్డు పేగు తింటే పిల్లలు పుడుతారన్న మూఢనమ్మకంతో ఓ అత్తింటివారు కోడలితో దాన్ని తినిపించారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. గుంటూరు జిల్లా నరసారావుపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 19, 2021, 06:19 PM IST
  • కోడలితో బొడ్డు పేగు తినిపించిన అత్తింటివారు
  • బొడ్డు పేగు తింటే సంతానం కలుగుతుందనే మూఢనమ్మకం
  • అనారోగ్యానికి గురై మృతి చెందిన వివాహిత
 Guntur: బొడ్డు పేగు తిని వివాహిత మృతి-సంతానం కలుగుతుందన్న మూఢనమ్మకంతో...

Woman eats umbilical cord to get pregnancy: సంతానం లేని దంపతులు అనుభవించే బాధ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మహిళలకు ఈ బాధ వర్ణనాతీతం. సూటి పోటి మాటలు... శుభకార్యాల్లో అవమానాలు ఎదురవుతుంటాయి. సంతానం కోసం గుళ్లు, గోపురాలు, ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. సంతానం లేక ఇలాగే ఎన్నో బాధలు పడ్డ ఓ యువతితో ఆమె అత్తింటివారు బొడ్డు పేగు ( umbilical cord) తినిపించారు. రెండు రోజుల తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. గుంటూరు (Guntur) జిల్లా నరసారావుపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది.

నరసారావుపేట (Narasaraopeta) మండలంలోని తూబాడు గ్రామానికి చెందిన రవి అనే యువకుడు రెండేళ్ల క్రితం సన్నిత అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహమే. పెళ్లయి రెండేళ్లయినా ఈ జంటకు పిల్లలు కలగలేదు. సంతానం కోసం ఎక్కడెక్కడో తిరిగి, ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఈ క్రమంలో ఈ నెల 13న తూబాడు గ్రామానికి చెందిన ఓ మహిళ ప్రసవించగా.. సన్నిత అత్తింటివారు ఆ బొడ్డు పేగు తీసుకొచ్చి సన్నితతో తినిపించారు.

ఆ తర్వాత రెండు రోజులకు సన్నిత తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో నరసరావుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం (డిసెంబర్ 17) సన్నిత మృతి చెందింది. సన్నిత మృతిపై ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పిల్లలు కలగలేదని తన బిడ్డను అత్తింటి వారు తరచూ వేధిస్తున్నారని... ఇదే క్రమంలో ఆమెకు విష పదార్థం తినిపించి చంపేశారని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు (Andhra Pradesh) ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Online Shopping: ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా-అయితే ఈ ఐదు జాగ్రత్తలు తప్పనిసరి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News