AP Road Accident - 3 persons killed: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోని వస్తుండగా శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. (Andhra Pradesh ) చిత్తూరు జిల్లాలోని పాకాల మండలం నేండ్రగుంట వద్ద (Road Accident) లారీ - ఓమ్ని వ్యాన్‌ ఢికొన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా మృతి చెందిన వారిని రాజమ్మ(80), అన్నపూర్ణ(60), జ్యోతి(14)గా గుర్తించారు. వీరంతా కర్ణాటక (karnataka) లోని నంగిరి మండలం తొండపల్లి గ్రామానికి చెందిన వారని పేర్కొన్నారు. Also Read: Night Curfew: ఒక్క రోజులోనే కర్ణాటక ప్రభుత్వం యూటర్న్


శుక్రవారం వైంకుఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి కర్ణాటక నుంచి తిరుమలకు వచ్చారు. దేవుడి దర్శనం అనంతం తిరుగు ప్రయాణమవుతుండగా.. (Chittoor district) నేండ్రగుంట వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Also read: Shruti Haasan: శృతి హాసన్.. గ్లామరస్ ఫొటోలు వైరల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook