ఏపీలో 16,207 పోస్టులు.. గడువు పెంచిన సర్కార్
Last date for Grama Sachivalayam Jobs గ్రామ సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ గడువు నేటితో ముగియనుంది. పరీక్ష ఫీజు చెల్లించి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోనివారు తప్పనిసరిగా ఈరోజు అప్లై చేసుకోవాలి. లేకపోతే చెల్లించిన ఫరీక్ష ఫీజు తిరిగి రాదు. పరీక్ష రాసే అవకాశం ఉండదు.
ఏపీ గ్రామ సచివాలయాల్లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తు గడువును పెంచారు. తొలుత పరీక్ష ఆన్ లైన్ దరఖాస్తు గడువు జనవరి 31 చివరి తేదీ కాగా తాజాగా ఫిబ్రవరి 7 వరకు పెంచారు. ఫీజు చెల్లించని అభ్యర్థులు సైతం ఆలస్యం చేయకుండా వెంటనే ఫీజు చెల్లించి, అనంతరం ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం బెటర్. ఆన్‌లైన్‌లో పరీక్ష ఫీజు ఇదివరకే చెల్లించని వారికి ఈ 16,207 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం వీలుకాదు. జనవరి
పరీక్ష ఫీజుగా రూ.200, దరఖాస్తు ఫీజు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు. నాన్-లోకల్ అభ్యర్థులు వారు జిల్లాకు అదనంగా రూ.100 చెల్లించాలి. వయోపరిమితి విషయానికొస్తే.. 01.01.2O20 నాటికి 18 - 42 సంవత్సరాల వయసు మధ్య ఉండాలి. 02.07.1978 - 01.07.2002 మధ్య జన్మించినవారిని అర్హులుగా పరిగణిస్తారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం కొందరికి వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి
దరఖాస్తు చేసుకునేందుకు క్లిక్ చేయండి
గ్రామ సచివాలయ ఉద్యోగాలు
పోస్టులు - ఉద్యోగాలు
పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-5 - 61
వెటర్నరీ అసిస్టెంట్ - 6,858
విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ - 1782
విలేజ్ సర్వేయర్ గ్రేడ్-3 - 1255
డిజిటల్ అసిస్టెంట్ - 1134
విలేజ్ వెల్ఫేర్ సెక్రటరీ - 762
ఏఎన్‌ఎం గ్రేడ్-3 - 648
విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రేడ్-2 536
ఇంజినీరింగ్ అసిస్టెంట్ - 570
వీఆర్వో గ్రేడ్-2 - 246
వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ - 97
విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ - 69
విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ - 43
గ్రామ సచివాలయ మొత్తం ఉద్యోగాలు- 14,061
గ్రామ సచివాలయం వెబ్‌సైట్ కోసం క్లిక్ చేయండి
వార్డు సచివాలయ ఉద్యోగాలు
పోస్టులు - ఉద్యోగాలు
వార్డ్ ప్లానింగ్, రెగ్యులేషన్ సెక్రెటరీ - 844
వార్డ్ శానిటేషన్, ఎన్విరాన్‌మెంట్ సెక్రెటరీ - 513
వార్డ్ అమినిటీస్ సెక్రటరీ - 371
వార్డ్ వెల్ఫేర్, డెవెలప్‌మెంట్ సెక్రెటరీ - 213
వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రెటరీ - 105
వార్డ్ ఎడ్యుకేషన్, డేటా ప్రాసెసింగ్ సెక్రెటరీ- 100
వార్డు సచివాలయ మొత్తం పోస్టులు - 2,146
మరింత ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి