Corona Cases in AP: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో నిన్నటి రోజుతో పోలిస్తే కొవిడ్ కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 25, 284 నమూనాలను పరీక్షించగా... 5,879 మందికి వైరస్ పాజిటివ్ (Covid-19 Cases in AP) గా నిర్ధారణ అయింది. దీంతో మెుత్తం కేసుల సంఖ్య 22,76,370కు చేరింది. కరోనా వైరస్ తో మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు చనిపోయినవారి సంఖ్య 14, 615కు పెరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గడిచిన 24 గంటల్లో 11,384 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో వైరస్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 21,51,238కు చేరింది. రాష్ట్రంలో 11,0517 యాక్టివ్ కేసులు (Corona active cases in ap) ఉన్నాయి. అనంతపురంలో అత్యధికంగా 856 కరోనా కేసులు వెలుగుచూశాయి. తర్వాత స్థానాల్లో తూర్పుగోదావరి 823, కడప 776 కేసులతో ఉన్నాయి. 


దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా 2,09,918 కొవిడ్ కేసులు (Corona Cases in India) నమోదయ్యాయి. కొత్తగా 959 మంది మరణించారు. వైరస్ నుంచి 2,62,628 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 15.77 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో 18,31,268 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 166.03 కోట్ల వ్యాక్సిన్ డోసులను (Vaccination) అందించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది.


Also Read: Andhra Pradesh: ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు...ఆర్డినెన్స్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook