ఏపీలో 24గంటల్లో 62 కొత్త కేసులు..!!
`కరోనా వైరస్` వేగంగా విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రాలను గజగజా వణికిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న ఒక్క రోజే 62 కొత్త కేసులు నమోదయ్యాయి.
'కరోనా వైరస్' వేగంగా విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రాలను గజగజా వణికిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న ఒక్క రోజే 62 కొత్త కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో నిన్న (శుక్రవారం) మొత్తం 5 వేల 943 శాంపిల్స్ ను పరీక్షించగా.. అందులో 62 కొత్త కేసులు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు ఏపీలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1525కు చేరాయి. ఇప్పటి వరకు కరోనా మహమ్మారికి 33 మంది మృతి చెందారు. కరోనా పాజిటివ్ కు చికిత్స చేసుకుని 441 మంది సురక్షితంగా ఇంటికి వెళ్లారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు ఐసోలేషన్ వార్డుల్లో 1051 మంది రోగులు చికిత్స తీసుకుంటున్నారు.
[[{"fid":"185093","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
మరోవైపు కర్నూలు జిల్లాలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గత 24 గంటల్లో 25 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 436కు చేరుకుంది. అందులో 360 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటి వరకు 66 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. 10 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు.
కర్నూలు తర్వాత గుంటూరు జిల్లాలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఐతే గత 24 గంటల్లో చాలా వరకు కేసులు తగ్గుముఖం పట్టడం కాస్త ఊరటనిస్తోంది. గుంటూరు జిల్లాలో గత 24 గంటల్లో కేవలం 2 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు కావడం విశేషం. దీంతో జిల్లాలో మొత్తంగా కేసుల సంఖ్య 308గా ఉంది. అందులో 203 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. 97 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా దెబ్బకు 8 మంది చనిపోయారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..