భారతదేశంలోనే బెస్ట్ సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( Ys jagan mohan reddy ) నిలుస్తారని సినీ నటుడు అలీ ( Actor Ali ) తెలిపారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ హాస్యనటుడిగా ఉన్న అలీ..2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ( ysr congress party ) లో కలిసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా పార్టీ తరపున రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రచారం కూడా నిర్వహించారు. ఇవాళ సీఎం జగన్ ( ap cm ys jagan ) తో మర్యాదపూర్వక భేటీ జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అలీ..పలు అంశాలపై వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ నాయకుడిని మర్యాదపూర్వకంగానే కలిశానన్నారు. ఈ సందర్బంగా కోవిడ్ ( Covid ) నేపధ్యంలో సినిమా పరిశ్రమ పరిస్థితి గురించి ముఖ్యమంత్రి వాకబు చేశారన్నారు. ఇంకా షూటింగ్స్ మొదలు కావడానికి సమయం పడుతుందని చెప్పానన్నారు. తక్కువ వయసులోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన జగన్.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నారన్నారు. సహజంగానే మంచి చేస్తున్నపుడు విమర్శించేవారు విమర్శిస్తుంటారని అలీ తెలిపారు. అవతలివారు చేయలేక పోయారు కాబట్టే ఈయనకి మంచి పేరు వస్తుందన్న అక్కసుతో విమర్శలు చేస్తున్నారని చెప్పారు. ఎవరెన్ని విమర్శలు చేసినా దేశంలో బెస్ట్ సీఎంగా జగన్ నిలుస్తారని అలీ అన్నారు.




కరోనా సంక్షోభం ( Corona crisis ) నేపధ్యంలో దాదాపు ఆరు నెలల పాటు నిలిచిపోయిన సినిమా షూటింగ్‌లు ఇటీవల మళ్లీ ప్రారంభమయ్యాయి. థియేటర్లు మాత్రం ఇంకా తెరుచుకోలేదు. థియేటర్లు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని సినిమా పరిశ్రమవర్గాలు కోరుతున్నాయి. ఏపీ సీఎం జగన్ ను కలిసిన సందర్భంలో అలీ వేసుకున్న డ్రెస్ పై ట్విట్టర్ లో నెటిజన్లు చెవులు కోసుకుంటున్నారు. డ్రెస్ కోడ్ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగుల్ని పోలి ఉందని...అలీ ముందుగా ఊహించే వేసుకున్నారా అనే వ్యాఖ్యానాలు విన్పిస్తున్నాయి. కావచ్చుకూడా.. అలీ ఎలాగూ వైసీపీ నేతనే కదా మరి.


Also read: Vijayawada Flyover: మరో రెండ్రోజుల్లో కనకదుర్గ ప్లై ఓవర్ ప్రారంభం