విజయవాడ ( Vijayawada ) వాసుల చిరకాల వాంఛ తీరబోతోంది. కనకదుర్గ వారధి పటిష్టతను పరీక్షించే చివరి పరీక్షలు మరోసారి నిర్వహించారు. సెప్టెంబర్ 18 నుంచి వారధి ప్రారంభం కానుంది.
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో అత్యంత రద్దీగా ఉండే నగరమైన విజయవాడలో ట్రాఫిక్ కష్టాలిక తీరనున్నాయి. విజయవాడ వాసుల చిరకాల వాంఛ అయిన కనకదుర్గ ఫ్లై ఓవర్ ఇక అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమైంది. ఫ్లై ఓవర్ ( Flyover ) సామర్ధ్యాన్ని పరీక్షించే చివరి పరీక్షల్ని మరోసారి నిర్వహించారు. నేషనల్ హైవే, ఆర్ అండ్ బీ అధికారులు ఇప్పటికే పలు పర్యాయాలు లోడ్ టెస్ట్‌లు నిర్వహించారు. మరో రెండు రోజుల్లో ఈ ఫ్లై ఓవర్ ప్రారంభం కానున్న నేపథ్యంలో చివరి సారిగా మంగళవారం దాదాపు 216 పౌండ్ల బరువుతో కూడిన తొమ్మిది టిప్పర్లను ఫ్లై ఓవర్‌పై ఉంచారు. ఈ టిప్పర్లను సుమారు 106 గంటలపాటు అలానే ఉంచనున్నారు. కాగా ఫ్లై ఓవర్ రోడ్లో సెంట్రల్ డివైడర్ పెయింటింగ్, జీబ్రా లైన్లు, ట్రాఫిక్ సిగ్నల్స్‌తో కూడిన బోర్డ్‌ల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. ఫిల్లర్‌కు ఫిల్లర్‌కు మధ్య జాయింట్లను కలుపుతూ తుది మెరుగులు చేస్తున్నారు. Also read: AP: వీరంగం సృష్టించిన రౌడీషీటర్.. 108 దహనం