Posani Krishna Murali Quits Politics: ఆంధ్ర ప్రదేశ్ లో కొలువైన కూటమి ప్రభుత్వం గతంలో తమ నేతలను అనరాని పచ్చి మాటలతో దాడి చేసిన నేతలపై ఉచ్చు బిగుస్తోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాజకీయంగా విమర్శలు కాకుండా.. కుటుంబ సభ్యులతో పాటు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మాట్లాడిన వారినీ .. పోస్టులు చేసిన వారిని టార్గెట్ చేస్తోంది. వైసీపీ వాళ్లు మాత్రం ఇది కక్ష్య సాధింపు చర్య అన్నా.. కూటమి ప్రభుత్వం మాత్రం ఇలాంటి వాటిని భవిష్యత్తులో కట్టడి చేయాలంటే కాస్తంత కటువు ప్రవర్తించాల్సిందే అంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేష్ లను అనరాని మాటలన్న పోసాని కృష్ణ మురళిపై ఇప్పటికే టీడీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ లలో కంప్లైంట్ చేసారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతేకాదు ఆయనపై పలు చోట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు అతి తొందరలోనే పోలీసులు పోసానిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాలిటిక్స్ కు దూరంగా ఉంటానంటూ పోసాని సంచలన ప్రకటన చేసారు. తన కుటుంబ సభ్యుల క్షేమం కోసమే రాజకీయాలను ఒదిలేస్తానంటూ సంచలన ప్రకటన చేసారు.  ముఖ్యంగా  చంద్రబాబు, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే ఎట్టా ఉంటాదో తెలుసా అంటూ కూటమి పార్టీల కార్యకర్తలు గతంలో తమను ముప్ప తిప్పలు పెట్టిన వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. అందులో పోసాని సహా పలువురు వైసీపీ నేతలున్నారు.


మరోవైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా తమ నేతలకు కూడా సోషల్ మీడియాలో ఎదుటి పార్టీలపై రాజకీయంగా విమర్శలు చేయండి కానీ.. వ్యక్తిగత దూషణలకు దిగకండి అంటూ హితబోధ చేస్తున్నారు.గత ప్రభుత్వ హయాంలో వైసీపీ కార్యకర్తలు చేసినట్టు చేయకండి అంటూ హితువు చెబుతున్నారు. వారి వాళ్ల మాటలను కార్యకర్తలు పట్టించుకుంటారా.. తమ ప్రభుత్వం ఉంది కదా అని.. శ్రీ రెడ్డి,రోజా వంటి వైసీపీ నేతలను టార్గెట్ చేస్తారా అనేది చూడాలి. ఏది ఏమైనా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ దురాగతాలకు ఇకనైనా పులిస్టాప్ పడుతుందా అనేది చూడాలి.


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter