Janasena: ఆంధ్రప్రదేశ్‌లో పట్టు సాధించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నారు. 2024 ఎన్నికల్లో పెద్ద పార్టీగా అవతరించాలని భావిస్తున్నారు. ఆ దిశగా కీలక నేతలకు గాలం వేస్తున్నారు. టీడీపీ, వైసీపీ పార్టీలకు దూరంగా ఉన్న కీలక నేతలను ఆ పార్టీ నేతలు సంప్రదిస్తున్నారు. జనసేనలోకి రావాలని ఆహ్వానిస్తున్నారు. ఇందులో ఆ పార్టీ సీనియర్ నేతలు నాగబాబు, నాదెండ్ల మనోహర్ కీలకంగా వ్యవహరిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేత నాగబాబును సినీ నటుడు, సీనియర్ నేత పృధ్వీరాజ్‌ కలిశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. త్వరలో పృధ్వీరాజ్‌ పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈమేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ నుంచి హామీ వచ్చినట్లు గుస గుస వినిపిస్తున్నాయి. త్వరలోనే పవన్ ఆధ్వర్యంలో జనసేనలో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


సినీ నటుడిగా పృధ్వీరాజ్ వందకు పైగా సినిమాల్లో నటించారు. ఖడ్గం సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్‌తో ఆయన పేరు మారు మోగింది. అప్పటి నుంచి పృధ్వీరాజ్‌కు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పేరు పడిపోయింది. సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2019 ఎన్నికల ముందు పృధ్వీరాజ్..వైసీపీలో చేరారు. ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. దీంతో ఆయనను పార్టీ స్టేట్ సెక్రటరీగా వైసీపీ అధినేత జగన్ నియమించారు.


2019 ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఆ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. పృధ్వీరాజ్‌కు నామినేటెడ్ పదవి ఖాయమని ప్రచారం జరగింది. దానికి తగ్గట్టుగానే ఆయనకు టీటీడీకి చెందిన ఎస్వీబీసీ ఛానల్‌కు ఛైర్మన్‌గా సీఎం జగన్ నియమించారు. ఇంతవరకు బాగానే ఉన్న ఆ తర్వాత జరిగిన పరిణామాలతో పార్టీ పదవితోపాటు ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఎస్వీబీసీ ఛానల్‌లోనే ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడుతూ పృధ్వీరాజ్‌ అడ్డంగా బుకైయ్యారు.


దీనిపై అప్పట్లో పెనుదుమారం రేగింది. ఘటనపై విచారణ చేసిన తర్వాత ఆయనను పార్టీ నుంచి, ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి నుంచి తొలగించారు. అప్పటి నుంచి పృధ్వీరాజ్‌ ఏ పార్టీలో చేరలేదు. తాజాగా జనసేనలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఆయనతోపాటు పలువురు నేతలు జనసేనలో చేరే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలో భారీ బహిరంగ సభ ద్వారా చేరికలు ఉంటాయని తెలుస్తోంది.


[[{"fid":"240539","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


Also read:IND vs WI 4th T20: రోహిత్‌ శర్మ ఫిట్.. శ్రేయాస్ అయ్యర్ ఔట్! డ్రీమ్ 11 టీమ్ ఇదే


Also read:Minister KTR: నేతన్నలకు నోటి మాటలు కాదు..నిధుల మూటలు ఇవ్వండి..గోయల్‌కు మంత్రి కేటీఆర్ లేఖాస్త్రం..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook