Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ అన్నదాతలకు శుభవార్త .. ఇకపై నేరుగా అకౌంట్లోకే డబ్బులు
డీబీటీ ద్వారా ఇకపై ఇచ్చే ఉచిత విద్యుత్ డబ్బుల్ని నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తామని హామీయిచ్చారు. దీంతో బిల్లులు అన్నీ ఇకపై రైతులే నేరుగా చెల్లిస్తారని చెప్పారు. ఈ పద్ధతి ద్వారా విద్యుత్ సేవల్లోని నాణ్యతను రైతులు నేరుగా ప్రశ్నిస్తారని అభిప్రాయపడ్డారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు సూచనలు జారీ చేశారు.
Andhra Pradesh: అన్నదాతలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మ్మోహన్ రెడ్డి శుభవార్త తెలిపారు. డీబీటీ ద్వారా ఇకపై ఇచ్చే ఉచిత విద్యుత్ డబ్బుల్ని నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తామని హామీయిచ్చారు. దీంతో బిల్లులు అన్నీ ఇకపై రైతులే నేరుగా చెల్లిస్తారని చెప్పారు. ఈ పద్ధతి ద్వారా విద్యుత్ సేవల్లోని నాణ్యతను రైతులు నేరుగా ప్రశ్నిస్తారని అభిప్రాయపడ్డారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు సూచనలు జారీ చేశారు. దీంతో పాటుగా రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, సప్లై, డిమాండ్, వినియోగం తదితర అంశాలపై చర్చించారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు భవిష్యత్‌లో చేపట్టబోయే ప్రాజెక్టులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వీటిని పూర్తి చేసేందుకు అవసరం అయిన నిధుల సమీకరణపై చర్చించారు. నిధుల కొరత ఉన్నా ప్రాజెక్టులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దని సూచించారు.
ఇక శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయిందని చెప్పారు. ఈ పైలెట్ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో 26,083 మందికి కొత్తగా కనెక్షన్లు ఇచ్చామని చెప్పారు. నిరంతరం విద్యుత్ సరఫరాతో విద్యుత్ ఆదా అవుతున్న విషయాన్ని ఈ సందర్భంగా నిపుణులు గ్రహించారని గుర్తు చేశారు. సరఫరా పంచే బాధ్యతను అధికారులు తీసుకోవాలని కోరారు. ఇక విద్యుత్ ఉత్పత్తి కోసం ముఖ్యంగా థర్మల్ విద్యుత్ ప్లాంట్లపై ఆధారపడిన నేపథ్యంలో బొగ్గు సప్లైకి అవాంతరాలు కలగకుండా చూడాలని కోరారు. ఇందు కోసం అవసరం అయితే కేంద్ర రైల్వే శాఖతో చర్చించాలని సూచించారు. అదనపు రైల్వే సర్వీసులు కేంద్రం ద్వారా పొంది బొగ్గు సరఫరాకు ఆటంకం కలగకుండా చూడాలని కోరారు. దేశ వ్యాప్తంగా బొగ్గు కొరత ఉన్నందున ఏపీ అధికారులు ముందుగానే అలర్ట్ అయి కేంద్రం నుంచి బొగ్గు తెల్పించాలని సూచించారు. కృష్ణపట్నం యూనిట్లలో 800 మెగావాట్ల చొప్పున అదనపు యూనిట్లను వీలైనంత త్వరగా ప్రారంభించాలని సూచించారు. ఇందు కోసం అవసరం అయితే తానే రంగంలోకి దిగుతానని చెప్పారు.
ఇక పారిశ్రామిక రంగానికి విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. దీంతో పాటుగా గృహ వినియోగదారులకు కూడా ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత విద్యుత్ శాఖ ఉద్యోగులపైనే ఉందని తేల్చిచెప్పారు. అయితే ఏపీలో పరిశ్రమలకు వారంలో రెండు రోజుల పవర్ హాలిడే ఉందని ఉన్నతాధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన సీఎం అవసరం అయితే ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలని సూచించారు. విద్యుత్ కొనుగోలుతో రాష్ట్రంలో కొరత లేకుండా చూడాల్సిన బాద్యత అధికారులపైనే ఉందని తేల్చిచెప్పారు.
Also Read Redmi Offer: Redmi 9A Sport మొబైల్ పై ప్రత్యేక ఆఫర్.. రూ.349 ధరకే అందుబాటులో!
Also Read మరో ప్రభుత్వ రంగ సంస్థను హస్తగతం చేసుకోనున్న టాటా గ్రూప్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook