AP Ministers Resign: ఏపీలో ముఖ్యమంత్రి జగన్​ మినహా.. సహచర మంత్రులంతా రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో కీలక విషయాలపై చర్చించిన తర్వాత.. మంత్రివర్గ సహచరులంతా మూక్కుమడి రాజీనామాలు సమర్పించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జగన్ ప్రభుత్వం ముందుగా నిర్ణయించినట్లే.. కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకు మంత్రులు రాజీనామా చేశారు. ఈ మేరకు పాత మంత్రుల చివరి కేబినెట్ సమావేశం అనంతరం.. మంత్రివర్గ సహచరులంతా తమ రాజీనామా పత్రాలను సీఎం జగన్​ను సమర్పించారు. తమ ప్రోటొకాల్ వాహనాలను కూడా వెనక్కి ఇచ్చేశారు. మంత్రుల రాజీనామా పత్రాలను రేపు గవర్నర్​కు సమర్పించనున్నారు.


ఇక సీఎం జగన్​ నేతృత్వంలో ఈ నెల 11న కొత్త మంత్రివర్గం కొలువుదీరనుంది. అయితే నేడు రాజీనామా చేసిన వారిలో ఎవరికైనా అవకాశం ఇస్తారా? లేదా అంతా కొత్త వారే ఉంటారా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన రావచ్చని తెలుస్తోంది. అయితే రాజీనామా చేసిన మంత్రులకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించనున్నారని తెలుస్తోంది. ఎవరూ నిరుత్సాహ పడకుండా.. చూసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.


Also read: CM Jagan: అంత అసూయపడితే త్వరగా టికెట్ తీసుకుంటారు.. మంచి చేస్తే శ్రీలంక, వెన్నుపోటు పొడిస్తే అమెరికానా..!


Also read: Shock for CBI officers: CBI అధికారులకు షాక్‌ ఇచ్చిన AP అధికారులు.. గదులు ఖాళీ చేయాలని ఆదేశం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook