Chandrababu Case Updates: చంద్రబాబును వెంటాడుతున్న ఇతర కేసులు, ఇవాళ హైకోర్టులో విచారణ
Chandrababu Case Updates: ఏపీ స్కిల్ కుంభకోణం నిందితుడు, టీడీపీ అధినేత చంద్రబాబుని ఇంకా కేసులు వెంటాడుతున్నాయి. స్కిల్ కుంభకోణం కేసులో బెయిల్ పొందినా ఇతర కేసులు ఆయనకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Case Updates: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు 52 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో తాజాగా ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇంకా ఇతర కేసులుండటంతో చంద్రబాబుకు పూర్తి స్థాయిలో రిలీఫ్ లేనట్టే..
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై నమోదైన పలు కేసులపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ఏపీ స్కిల్ స్కాంలో అరెస్ట్ అయి 52 రోజుల రిమాండ్ తరువాత ఏపీ హైకోర్టు నుంచి బెయిల్ పొందారు. అంతకంటే ముందు ఆరోగ్య కారణాలతో కంటి ఆపరేషన్ కోసం నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ఈ బెయిల్ ప్రకారం నవంబర్ 28 సాయంత్రం 5 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలులో లొంగిపోవల్సి ఉంది. ఈలోగా అదే హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో మళ్లీ జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మరో రెండు కేసులకు సంబంధించి ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్‌పై నిన్న విచారణ జరిగింది. సీఐడీ తరపు న్యాయవాది కొంత సమయం కోరగా కేసు ఇవాళ్టికి వాయిదా పడింది. ఐఆర్ఆర్ కేసులో ఇవాళ సీఐడీ తన వాదనలు విన్పించనుంది.
మరోవైపు చంద్రబాబు హయాంలో మద్యం పాలసీలో జరిగిన అవకతవకలపై సీఐడీ మరో కేసు నమోదు చేసింది. ఈ కేసులో కూడా చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసుకున్నారు. మద్యం పాలసీలో అక్రమాలతో ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారనేది ప్రధాన ఆరోపణ. ఈ పిటీషన్‌పై గత రెండ్రోజుల్నించి విచారణ కొనసాగుతోంది. కేవలం రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై ఈ కేసు నమోదు చేసినట్టు చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించారు. ఇదే కేసులో అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రపై కూడా కేసు నమోదైంది. అటు అమరావతి అసైన్డ్ భూముల కేసులో మాజీ మంత్రి నారాయణపై అవినీతి, అక్రమాల ఆరోపణలుఉన్నాయి. ఈ కేసును తిరిగి ఓపెన్ చేసేందుకు అనుమతివ్వాలని సీఐడీ కోరింది.
ఇవి కాకుండా ఏపీ ఫైబర్ నెట్, అంగళ్లు కేసులు చంద్రబాబుపై ఉన్నాయి. వీటిపై కూడా విచారణ జరుగుతోంది. ఈ రెండు కేసుల్లో కూడా ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు పిల్ దాఖలు చేశారు.
Also read: Telangana Elections 2023: సంచలనం రేపుతున్న సీ నెక్స్ట్ సర్వే, ఆ పార్టీదే అధికారం, ఆయనకు ఓటమి తప్పదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook