Telangana Elections 2023: సంచలనం రేపుతున్న సీ నెక్స్ట్ సర్వే, ఆ పార్టీదే అధికారం, ఆయనకు ఓటమి తప్పదా

Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. మరో వారం రోజుల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికలు సమీపించే కొద్దీ వివిధ పార్టీల అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో మరో సర్వే వెల్లడించిన ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 25, 2023, 04:35 PM IST
Telangana Elections 2023: సంచలనం రేపుతున్న సీ నెక్స్ట్ సర్వే, ఆ పార్టీదే అధికారం, ఆయనకు ఓటమి తప్పదా

Telangana Elections 2023: తెలంగాణలో నవంబర్ 30 ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్‌కు కేవలం వారం రోజుల వ్యవధి మిగిలింది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. అధికార పార్టీ హ్యాట్రిక్ ఆశిస్తుంటే కాంగ్రెస్ ఎలాగైనా అధికారం చేజిక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది. మరి ఆ సర్వే ఏం చెబుతోంది..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపించేకొద్దీ వివిధ సంస్థల సర్వేలు సందడి చేస్తున్నాయి. ఇప్పటికే వివిధ సంస్థల సర్వేల ఫలితాలు వేర్వేరుగా ఉన్నాయి. కొన్ని కాంగ్రెస్ పార్టీకు పట్టం కడితే మరికొన్ని బీఆర్ఎస్ పార్టీదే మళ్లీ అధికారం అని తేల్చేశాయి. ఇంకొన్ని హంగ్ తప్పదంటున్నాయి. ఇప్పుడు తెలంగాణలో పోలింగ్ కేవలం వారం రోజులు మాత్రమే సమయముంది. ఈ నేపధ్యంలో సీ నెక్స్ట్ అనే సంస్థ చేసిన సర్వే ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి. రాష్ట్రంలో ఈ నెల 21 అంటే మొన్నటి వరకూ ఉన్న పరిస్థితుల ఆధారంగా సీ నెక్స్ట్ సంస్థ సర్వే చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్నించి శాంపుల్ సేకరించింది. 

సీ నెక్స్ట్ సర్వే ప్రకారం రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్ అనూహ్యంగా బలపడిందని తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకు ఏకపక్ష విజయం తధ్యమని సర్వే అభిప్రాయపడింది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 91 సీట్లు సొంతం చేసుకుంటుందని ఈ సర్వే సంచలనం రేపింది. అధికార బీఆర్ఎస్ కేవలం 14 సీట్లకు పరిమితం కాగా ఎంఐఎం సైతం 4 స్థానాలకు పడిపోనుంది. ఇక బీజేపీ 5 స్థానాలు గెల్చుకోవచ్చు. బీఎస్పీ సైతం ఒక స్థానంలో విజయం సాధించనుందని సీ నెక్స్ట్ సర్వే తెలిపింది. 5-6 స్థానాల్లో హోరాహోరీ పోటీ ఉంటుందని సంస్థ తెలిపింది. 

కరీంనగర్, సిరిసిల్ల, నర్శాపూర్, చేవెళ్ల, మలక్‌పేట్ నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఉండనుంది. ఈ సర్వేలో మరో సంచలన నిర్ణయం వెల్లడైంది. కేసీఆర్ పోటీ చేస్తున్న రెండు స్థానాల్లో ఓడిపోనున్నట్టు సీ నెక్స్ట్ చెప్పడం సంచలనం రేపుతోంది. మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నుంచి బీఎస్పీ అభ్యర్ధిగా విజయం సాధించనున్నారని ఈ సర్వే తెలిపింది. 

Also read: CM KCR: మీ తలరాతను మార్చే ఆయుధమే ఓటు.. అభివృద్ధికే పట్టం కట్టండి: సీఎం కేసీఆర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News