Pawan Kalyan Vs Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ లో అధికార, విపక్షాల మధ్య వార్ కంటిన్యూ అవుతోంది. విశాఖలో ఉత్తరాంధ్ర జేఏసీ నిర్వహించిన గర్జన సందర్భంగా తలెత్తిన పరిణామాలతో వైసీపీ, జనసేన మధ్య కాక రాజుకుంది. ఇరు పార్టీల నేతలు వ్యక్తిగత ఆరోపణలు చేసుకున్నారు. మూడు రాజధానుల కేంద్రంగా కొన్ని రోజులుగా మాటల యుద్దం సాగుతుండగా.. తాజాగా పోలవరం విషయంలో వైసీపీ, జనసేన మధ్య రచ్చ సాగింది. పోలవరం నిర్మాణంపై మొదటి నుంచి వైసీపీ, టీడీపీ మధ్య సవాళ్లు జరుగుతున్నాయి. తాము 70 శాతం పూర్తి చేసిన ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం పక్కన పడేసిందని టీడీపీ ఆరోపిస్తోంది. టీడీపీ అనాలోచిత నిర్ణయం వల్లే పోలవరం ఆలస్యం అవుతుందని.. కాపర్ డ్యాం ముందు కట్టకుండా డయాఫ్రం వాల్ ఎలా నిర్మిస్తారని వైసీపీ ప్రశ్నిస్తోంది.వరదలకు డయాఫ్రం వాల్  కొట్టుకుపోవడంతో వందల కోట్ల రూపాయలు వృథా కావడంతో పాటు ప్రాజెక్టు పనులకు ఆటంకం ఏర్పడిందని చెబుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలవరం వార్ లోకి ఇప్పుడు జనసేన ఎంట్రీ ఇచ్చింది. జనసేన చీఫ పవన్ కళ్యాణ్ ట్వీట్ సంచలనంగా మారింది. పోలవరం ప్రాజెక్ట్ ఎంతవరకూ వచ్చింది.. ఎపుడు పూర్తవుతుంది.. అన్నది ఒక అరగంట ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడగలవా అంబటీ అని ట్వీట్ చేశారు పవన్ కల్యాణ్. గతంలో అంబటి మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి.  అరగంట సేపు మాట్లాడాలి అంటూ లేడీ యాంకర్ తో మాట్లాడిన ఆడియో లీకై వైరల్ గా మారింది. ఈ విషయంలో అంబటి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు మధ్య పెద్ద వారే నడిచింది. ఆ అరగంటను గుర్తు చేస్తూ పోలవరం విషయంలో అంబటిపై సెటైర్లు వేస్తూ ట్వీట్ చేశారు జనసేన చీఫ్.


అరగంట సేపు మాట్లాడుతారా అంటూ పవన్ చేసిన ట్వీట్ కు అదే స్థాయిలో కౌంటరిచ్చారు ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు. పవన్ కళ్యాణ్ నాలుగవ పెళ్ళి అయ్యేలోగా పోలవరాన్ని పూర్తి చేస్తామని ట్వీట్ చేశారు. పవన్ పై మూడు పెళ్లిళ్ల వివాదం ఉంది. పవన్ ను టార్గేట్ చేయడానికి పెళ్లిళ్ల విషయాన్ని ఎంచుకుంటారు ప్రత్యర్థులు. అందులో భాగంగానే పవన్ కల్యాణ్ నాలుగో పెళ్లి చేసుకునే లోగా పోలవరం పూర్తి చేస్తామని చెబుతూ.. స్ట్రాంగ్ కౌంటరిచ్చారు అంబటి రాంబాబు.



Also Read : TRS OPERATION AKARSH: నేరుగా గ్రౌండ్ లోకి దిగిన సీఎం కేసీఆర్.. కారెక్కనున్న ఉద్యమ లీడర్లు?


Also Read : Komati Reddy Venkat Reddy: కోమటి రెడ్డి ఆడియో లీక్.. మునుగోడులో కలకలం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook