Anakapalli Crime Incident: ఏపీలోని అనకాపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కాబోయే భర్తపై ఓ యువతి హత్యాయత్నం చేసింది. కవ్వించే మాటలతో అతనికి ఫోన్ చేసి రప్పించి కత్తితో వేటు వేసింది. గిఫ్ట్ ఇస్తా కళ్లు మూసుకో అని చెప్పి అతని గొంతులో కత్తితో పొడిచింది. నాటకీయంగా జరిగిన ఈ ఘటన అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలంలోని అమరాపురి గ్రామంలో చోటు చేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలీసుల కథనం ప్రకారం... జిల్లాలోని మాడుగుల మండలానికి చెందిన అద్దెపల్లి రాము నాయుడు (28), రావి కమతం గ్రామానికి చెందిన వియ్యపు పుష్ప (22)లకు ఈ నెల 6న నిశ్చితార్థం జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో పీహెచ్‌డీ చేస్తున్న రాము నాయుడు ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో సోమవారం (ఏప్రిల్ 18) అతనికి ఫోన్ చేసిన పుష్ప... తన స్నేహితులను పరిచయం చేస్తానని చెప్పి అమరాపురి సమీపంలోని ఓ ఆశ్రమం వద్దకు పిలిపించింది.


అక్కడ ఇద్దరు కలిసి గంట పాటు గడిపారు. సాయంత్రం సమయంలో తిరిగి ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యలో ఓ నిర్మానుష్య ప్రదేశంలో.. ఇక్కడ కాసేపు ఆగుదామని పుష్ప రాము నాయుడిని అడిగింది. రాము అందుకు సరేననడంతో... నీకో సర్‌ప్రైజ్ గిఫ్ట్ అంటూ అతన్ని కళ్లు మూసుకోమని చెప్పింది. రాము కళ్లకు తన చున్నీతో గంతలు కట్టింది. అనంతరం వెంట తెచ్చుకున్న కత్తితో అతని గొంతులో పొడిచింది. నొప్పి, తీవ్ర రక్తస్రావంతో విలవిల్లాడుతూ రాము కింద పడిపోయాడు. ఆపై పుష్ప అక్కడి నుంచి పారిపోయింది.


అటుగా వెళ్తున్న కొంతమంది రామును గమనించి ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు పుష్పను విచారించగా... రాము రోడ్డు ప్రమాదంలో గాయపడినట్లు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. కానీ అంతకుముందే పోలీసులు రాము వాంగ్మూలం తీసుకోగా... పుష్పనే తనపై దాడి చేసినట్లు చెప్పాడు. పుష్పకు రాముతో పెళ్లి ఇష్టం లేనందు వల్లే అతనిపై హత్యాయత్నం చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.


Also Read: RR vs KKR: చహల్ మాయ.. ఒబెడ్ మెక్కాయ్ సూపర్ బౌలింగ్! ఉత్కంఠ పోరులో కోల్‌కతాపై రాజస్థాన్ విజయం!


RR vs KKR: ఐపీఎల్ 2022లో మరో అద్భుతం, ప్యాట్ కమ్మిన్స్, శివమ్ మావిల అద్భుత ఫీట్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook