RR vs KKR: ఐపీఎల్ 2022లో మరో అద్భుతం, ప్యాట్ కమ్మిన్స్, శివమ్ మావిల అద్భుత ఫీట్, గ్రేట్ క్యాచ్

RR vs KKR: ఐపీఎల్ 2022లో ప్రతిరోజూ ఏదో ఒక ఆసక్తికర సన్నివేశమో..అద్బుతమో జరుగుతూనే ఉంటోంది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్‌లో ఇటువంటిదే మరో అద్భుతం చోటుచేసుకుంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 19, 2022, 12:09 PM IST
  • ఆర్ఆర్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్‌లో అద్భుతం
  • అసాధ్యమైన క్యాచ్‌ను ఇద్దరు కలిసి సుసాధ్యం చేసిన వైనం, వీడియో వైరల్
  • బౌండరీలైన్‌పై ప్యాట్ కమ్మిన్స్, శివమ్ మావిల అద్భుత ఫీట్
 RR vs KKR: ఐపీఎల్ 2022లో మరో అద్భుతం, ప్యాట్ కమ్మిన్స్, శివమ్ మావిల అద్భుత ఫీట్, గ్రేట్ క్యాచ్

RR vs KKR: ఐపీఎల్ 2022లో ప్రతిరోజూ ఏదో ఒక ఆసక్తికర సన్నివేశమో..అద్బుతమో జరుగుతూనే ఉంటోంది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్‌లో ఇటువంటిదే మరో అద్భుతం చోటుచేసుకుంది.

ఐపీఎల్ 2022లో భాగంగా సోమవారం జరిగిన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఓ అద్భుతమైన, అసాధ్యమైన క్యాచ్‌కు వేదికగా నిలిచింది. ఇద్దరు కలిసి పట్టిన ఆ క్యాచ్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 

కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 7 పరుగుల తేడాతో గెలిచింది. అయితే కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాళ్లకు ప్యాట్ కమ్మిన్స్, శివమ్ మావిలు కలిసి చేసిన ఫీట్ అందర్నీ మైమరపించింది. ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తోంది. ఇద్దరూ కలిసి చేసిన ఆ ఫీట్ ఓ గ్రేట్ క్యాచ్‌కు వేదికగా నిలిచింది. బౌండరీ లైన్‌పై అసాధ్యమైన క్యాచ్‌ను సుసాధ్యం చేశారిద్దరూ కలిసి.

ప్యాట్ కమ్మిన్స్ -శివమ్ మావిల అద్భుత క్యాచ్

రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ క్రీజ్‌లో ఉన్నాడు. కేకేఆర్ బౌలర్ సునీల్ నరైన్ 18వ ఓవర్ బౌల్ చేస్తున్నాడు. సునీల్ నరైన్ వేసిన బంతిని నేరుగా సిక్సర్ కొట్టేందుకు రియాన్ ప్రయత్నించాడు. కచ్చితంగా సిక్సర్ అయ్యేదే. బౌండరీ లైన్‌లో ఆ ఇద్దరూ లేకుంటే. మిడ్ ఆఫ్‌పై ఉన్న ప్యాట్ కమ్మిన్స్ అద్భుతంగా డైవ్ చేస్తూ బంతిని గాల్లో పట్టుకున్నాడు. అయితే ఆ ఊపులో బౌండరీ దాటుతానేమోనని అనుమానం వచ్చింది. అనుమానం వచ్చిందే  ఆలస్యం..రెప్పపాటుకాలంలో..పట్టిన బంతిని..లాంగ్ ఆన్ నుంచి తనవైపుకు వస్తున్న శివమ్ మావివైపుకు గాలిలో విసిరాడు. ఇప్పుడు శివమ్ మావి కూడా రెప్పపాటులో జరిగింది గ్రహించాడు. ప్యాట్ కమ్మిన్స్ విసిరిన బంతిని ఒక్కసారిగా గాలిలో ఎగిరి క్యాచ్ తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఫలితంగా 5 పరుగులకు రియాన్ పరాగ్ అవుటయ్యాడు. అందరూ ఇప్పుడు ప్యాట్ కమ్మిన్స్-శివమ్ మావిలను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Also read: RR vs KKR: చహల్ మాయ.. ఒబెడ్ మెక్కాయ్ సూపర్ బౌలింగ్! ఉత్కంఠ పోరులో కోల్‌కతాపై రాజస్థాన్ విజయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News