దేశవ్యాప్తంగా ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఈ జాబితాలో ఏపీ, తెలంగాణ న్యాయమూర్తులు ఏకంగా ఐదుగురు ఉన్నారు. ఈ బదిలీ పూర్తిగా ఏకపక్షంగా..వివక్షకు తావిస్తూ ఉందని న్యాయవాదులు ఆందోళనకు దిగారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సుప్రీంకోర్టు కొలీజియం బదిలీకు సిఫారసు చేసిన న్యాయమూర్తుల్లో జస్టిస్ దేవానంద్, జస్టిస్ రమేశ్, జస్టిన్ నాగార్జున, జస్టిస్ కన్నెగంటి లలిత, జస్టిస్ అభిషేక్ రెడ్డి ఉన్నారు. గుజరాత్ న్యాయమూర్తి జస్టిస్ నిఖిల్ పేరు ప్రతిపాదించినా..ఆ తరువాత గుజరాత్ అడ్వకేట్స్ అసోసియేషన్ అభ్యంతరాల నేపధ్యంలో వెనక్కి తీసుకున్నారు. కానీ ఏపీ, తెలంగాణ విషయంలో అలా జరగలేదు. ఇదే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో న్యాయవాదుల ఆగ్రహానికి కారణమైంది.


సుప్రీంకోర్టు కొలీజియం ఉత్తరాది, దక్షిణాది మధ్య వివక్ష పాటిస్తోందని న్యాయవాదులు విమర్శించారు. కొలీజియం వైఖరిని నిరసనగా విధులు బహిష్కరించాలని ఏపీ బార్ కౌన్సిల్, తెలంగాణ బార్ కౌన్సిల్ నిర్ణయించాయి. జస్టిస్ అభిషేక్ రెడ్డి, జస్టిస్ దేవానంద్, జస్టిస్ రమేశ్ బదిలీలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పిక్ అండ్ సెలెక్ట్ పద్దతి న్యాయమూర్తుల మనోభావాల్ని దెబ్బతీస్తుందని న్యాయవాదులు ఆరోపించారు. 


అదే సమయంలో మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి రాజా బదిలీపై కూడా తమిళనాడులో అభ్యంతరం వ్యక్తమౌతోంది. గుజరాత్ న్యాయమూర్తి బదిలీ విషయంలో ఆ రాష్ట్ర న్యాయవాదుల అభ్యంతరాల్ని పరిగణలో తీసుకున్నప్పుడు దక్షిణాది రాష్ట్రాల న్యాయవాదుల అభ్యంతరాల్ని ఎందుకు విస్మరించారని న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు.


Also read: AP High Court: ఏపీ హైకోర్టు న్యాయముర్తి బదిలీ ఎందుకు చర్చనీయాంశమౌతోంది, అసలేమైంది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook