AP Elections Survey: ఏపీలో అధికారంపై ఇరుపక్షాల్లోనూ విశ్వాసం, ధీమా కన్పిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌లో అయితే అంతులేని ధీమా వ్యక్తమౌతోంది. పార్టీల అధినేతలు పోలింగ్ సరళిపై అన్నివైపుల్నించి, వివిధ కోణాల్లో సమాచారం సేకరిస్తున్నారు. పార్టీ కేడర్‌కు ఎన్నికల ఫలితాలపై స్పష్టత ఇస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ ఎన్నికల ఫలితాల తేదీ సమీపించేకొద్దీ ఉత్కంఠ పెరిగిపోతోంది. ఏ సర్వే సంస్థకు అందనట్టుగా పోలింగ్ సరళి నమోదైంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. ఈసారి నిశ్శబ్ద ఓటింగ్ భారీగా జరిగింది. అటు పోలింగ్ శాతం కూడా పెరిగింది. అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు పట్టుందని భావిస్తున్న గ్రామీణ ఓటింగ్, మహిళా ఓటింగ్ ఎక్కువగా జరగడంతో ఆ పార్టీలో ధీమా ఎక్కువైంది. పోలింగ్ శాతం పెరగడం తమకు లాభిస్తుందనే అంచనాల్లో కూటమి నేతలున్నారు. పోలింగ్ జరిగిన తరువాత వివిధ వర్గాలు, సర్వే సంస్థల ద్వారా పోలింగ్ సరళి, ఓటరు నాడి తెలుసుకునే ప్రయత్నం అటు జగన్, ఇటు చంద్రబాబు ఇద్దరూ చేశారు. ఈ ఫలితాలపై చంద్రబాబు స్పందించకపోయినా రెండ్రోజుల సుదీర్ఘ మంతనాల తరువాత ఐప్యాక్ సమావేశంలో జగన్ అత్యంత ధీమాతో 151 దాటి సీట్లు సాధించబోతున్నామని, దేశం మొత్తం ఏపీవైపు చూస్తుందని ప్రకటించారు. 


ఆ తరువాత లండన్ పర్యటనకు వెళ్లిన వైఎస్ జగన్ ఇదే అంశంపై మరింత లోతుగా అధ్యయనం చేశారు. ఇంకొన్ని సమీకరణాల ఆధారంగా నివేదికలు ఇవ్వాలని మూడు సర్వే సంస్థల్ని కోరారు. అటు చంద్రబాబు కూడా మరోసారి సర్వే సంస్థలతో నివేదిక తెప్పించుకున్నారు. ఈ డేటా ఆధారంగా సమీక్షించిన జగన్, చంద్రబాబులు తామే అధికారంలో వస్తున్నామని కేడర్‌కు సంకేతాలు అందించారు. అందుకే ఇప్పుడు టెన్షన్ మరింత పెరిగింది.


Also read: Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజనతో 70 లక్షలు పొందడం ఎలా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook