AP Assembly Results 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వైసీపీ అభ్యర్ధులు, మెజార్టీ ఇలా
AP Assembly Results 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమిపాలైంది. వైనాట్ 175 లక్ష్యంతో బరిలో దిగిన పార్టీ కాస్తా కేవలం 11 స్థానాలకు పరిమితమైంది. అసలు వైసీపీ అభ్యర్ధులు ఎక్కడెక్కడ, ఎంత మెజార్టీతో గెలిచారో పరిశీలిద్దాం.
AP Assembly Results 2024: ఏపీ అసెంబ్లీ 2024 ఎన్నికల ఫలితాలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. ఎగ్జిట్ పోల్స్‌ను కాదని ఫలితాలు విస్మయపరిచాయి. కూటమికి ల్యాండ్ స్లైడ్ విక్టరీ అందించాయి. కూటమి మూడు పార్టీలు కలిసి 164 సీట్లు కైవసం చేసుకోవడం చిన్న విషయమేం కాదు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడి అఖంఢ విజయాన్ని కైవసం చేసుకున్నాయి. వైనాట్ 175 లక్ష్యంతో బరిలో దిగిన అధికార పార్టీ ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది. కూటమిలోని జనసేన రెండవ అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఏపీలో ఈ ఫలితం ఎవరూ ఊహించనిది. ఎగ్జిట్ పోల్స్‌లో కొన్ని కూటమికి పట్టం కడితే మరికొన్ని అధికార పార్టీకు పట్టం కట్టాయి. జాతీయ సర్వే సంస్థల్లో మెజార్టీ కూటమిదే విజయమని చెప్పినా ఇంత భారీ విజయం, వన్ సైడ్ వార్ ఉంటుందని పసిగట్టలేకపోయాయి. దాంతో తెలుగుదేశం పార్టీ 136 స్థానాలు, జనసేన 21 స్థానాలు, బీజేపీ 7 స్థానాలు కైవసం చేసుకున్నాయి. వైసీపీ కేవలం 11 స్థానాలకు పరిమితమైంది. వైసీపీ ఎక్కడెక్కడ ఎంత మెజార్టీతో గెలిచిందో చూద్దాం
వైసీపీ గెలిచిన స్థానాలు వచ్చిన మెజార్టీ వివరాలు
పులివెందుల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 1,16,315 ఓట్లు రాగా మెజార్టీ 61,687 ఓట్లు
పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 1,00793 ఓట్లు రాగా మెజార్టీ 6,095 ఓట్లు
మంత్రాలయం బాల నాగిరెడ్డి 87,662 ఓట్ల రాగా మెజార్టీ 12,805 ఓట్లు
రాజంపేట ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి 92,609 ఓట్లు రాగా మెజార్టీ 7016 ఓట్లు
ధర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి 1,01,889 ఓట్లు రాగా మెజార్టీ 2456 ఓట్లు
అరకు రేగం మత్స్యలింగం 65,658 ఓట్లు రాగా మెజార్టీ 31,877 ఓట్లు
పాడేరు మత్స్యరాజ విశ్వేశ్వరరాజు 68,170 ఓట్లు రాగా మెజార్టీ 19,338 ఓట్లు
యర్రగొండపాలెం తాటిపర్తి చంద్రశేఖర్ 91,741 ఓట్లు రాగా మెజార్టీ 5200 ఓట్లు
బద్వేల్ దాసరి సుద 90,410 ఓట్లు రాగా మెజార్టీ 18,567 ఓట్లు
ఆలూరు బి విరూపాక్షి 1,00264 ఓట్లు రాగా మెజార్టీ 2831 ఓట్లు
తంబళ్లపల్లె పి ద్వారకానాథ్ రెడ్డి 94,136 ఓట్లు రాగా మెజార్టీ 10,103 ఓట్లు
Also read: Pawan Kalyan Win: పిఠాపురంలో పవన్ కల్యాణ్ ప్రభంజనం.. హారతి ఇచ్చిన అనా లెజినోవా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook