నేడే ఆంధ్రప్రదేశ్ బంద్
ఏప్రిల్ 16వ తేదిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేకహోదా విభజన హామీల సమితి బంద్‌కు పిలుపునిచ్చింది.
ఏప్రిల్ 16వ తేదిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేకహోదా విభజన హామీల సమితి బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు లెఫ్ట్ పార్టీలతో పాటు వైఎస్సాఆర్ కాంగ్రెస్, జనసేన పార్టీల మద్దతు కూడా ఉండడం గమనార్హం. ఆసుపత్రులు, ఫార్మసీల వంటి అత్యవసర కేంద్రాలు తప్ప మిగతా వాణిజ్య కార్యకలాపాలు అన్ని కూడా సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో నిలిచిపోయేలా బంద్ ప్రకటిస్తున్నామని ఈ సందర్భంగా బంద్ నిర్వాహకులు తెలిపారు.
విజయవాడ, విశాఖపట్నం కేంద్రాలను ప్రధానంగా చేసుకొని ముఖ్యంగా ఈ బంద్ నిర్వహించనున్నట్లు తెలిపారు.స్కూళ్లు, కాలేజీలతో పాటు షాపులు, రవాణా వాహనాలు కూడా ఈ రోజు బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. ఈ బంద్ కారణంగానే గీతం విశ్వవిద్యాలయం కూడా పరీక్షలను వాయిదా వేయడం జరిగింది
ఈ బంద్‌కి కార్మిక సంఘాలు కూడా తమ మద్దతును తెలిపాయి. సీఐటీయు, ఏఐటియూసీ లాంటి ట్రేడ్ యూనియన్లు కూడా బంద్‌లో పాల్గొననున్నట్లు తెలిపాయి. అయితే ఇంకా ఈ బంద్ సందర్భంగా ఆర్టీసీ బస్సులు నడుస్తాయా? లేదా అన్న విషయంపై ఎలాంటి స్పష్టత కూడా లేదు. ఈ బంద్ నిర్వహించడానికే ఇప్పటికే సమితి సిద్ధమైనందున పలు ప్రాంతాలలో భారీ స్థాయిలో పోలీసు బలగాలను మోహరించే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే ఇదే విషయంపై స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వేరే విధంగా స్పందించారు. పోరాటం చేయాలనుకుంటే ఢిల్లీలో చేయాలి గానీ.. రాష్ట్రంలో అలజడి చెలరేగేలా చేస్తే ప్రధాని సంతోషిస్తారా? అని తెలిపారు