AP Assembly Sessions: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. నవంబర్ 22 వరకు ఈ సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి. కాగా  ఉదయం అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2024-25 ఇయర్ కు గాను  ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆర్ధిక మంత్రిగా పయ్యావులకు ఇదే తొలి బడ్జెట్.  అంతకుముందే ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గం  సమావేశం జరగనుంది.ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో 2024-25 ఆర్థిక బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలియజేయనుంది. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్టు సహా పలు కీలకమైన బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారని తెలుస్తోంది. ఉదయం 10 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 11 గంటలకు సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. అదే విధంగా శాసనసభలో వ్యవసాయ బడ్జెట్‌​ని మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు.  కాగా ఈ సమావేశాలకు హాజరుకాకూడదని ప్రతిపక్ష YSRCP నిర్ణయం తీసుకుంది. మరో వైపు అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత సభాపతి అధ్యక్షతన బీఎసీ సమావేశం జరగనుంది. వైసీపీ హాజరు కాకపోతే.. మొత్తం అధికర పక్షంలో ఉన్న మూడు పార్టీలే బీఏసీ సమావేశంలో పాల్గొననున్నాయ. అక్కడ సభా సమావేశాలు ఎన్ని రోజుల పాటు నిర్వహించాలన్న విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఆర్ధిక స్థితిగతులను అధ్యయనం చేయడానికే ప్రభుత్వం ఎక్కవు సమయం కేటాయించింది. దీంతో బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఆలస్యమైంది.


ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను  రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది ఎన్టీయే కూటమి ప్రభుత్వం. ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్‌ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సుమారు రూ. 2.90 లక్షల కోట్లతో బడ్జెట్‌  ప్రవేశ పెట్టనున్నారు. అభివృద్ధి, సంక్షేమం సమతూకంగా ఈ బడ్జెట్‌ను రూపొందించినట్టు సమాచారం. రాష్ట్ర పునర్‌ నిర్మాణం, పేదల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్‌ ను రెడీ చేశారు. అనంతరం  ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సభ ముందు ఉంచుతారు. శాసనమండలిలో బడ్జెట్‌ను మంత్రి కొల్లు రవీంద్ర, వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి నారాయణ ప్రవేశపెడతారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ను రెండుసార్లు ఆమోదింపజేసుకొని నిధులు ఖర్చు చేస్తున్నారు.


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.