AP Cabinet Meet: అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ మండలి సమావేశమైంది. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడిన అనంతరం జరిగిన మొదటి మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు నాయుడు సంతకాలు చేసిన తొలి ఐదు హామీల అమలుతోపాటు అన్న క్యాంటీన్‌ల ఏర్పాటు, వైద్యారోగ్య వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు పునరుద్ధరణ, 6 శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేయడం వంటి కీలక నిర్ణయాలు తీసుకుంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Hyper Aadi: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను వాడేసుకుంటున్న కమెడియన్ హైపర్ ఆది


 


అమరాతిలోని సచివాలయంలో సోమవారం మంత్రివర్గ సమావేశం మూడున్నర గంటల పాటు కొనసాగింది. వాటిలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు సంతకాలు చేసిన మెగా డీఎస్సీ, ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం రద్దు, ఏప్రిల్‌ నుంచి పింఛన్‌ పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ సమావేశంలో పలు కీలకాంశాలపై మంత్రివర్గం చర్చించింది. గత పాలనలో జరిగిన విధానపరమైన తప్పిదాలపై చర్చిస్తూనే 6 శాఖలపై శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అయితే శ్వేతపత్రాల విడుదలపై మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఐదేళ్ల వైఎస్‌ జగన్‌ పాలనలో అవినీతి, అక్రమాలపై ఉప సంఘం అధ్యయనం చేయనుంది. ఆ శాఖలు ఏవంటే పోలవరం (జల వనరులు), అమరావతి (పట్టణ శాఖ), విద్యుత్‌, పర్యావరణం, మద్యం, ఆర్థిక, శాంతిభద్రతలపై శ్వేత పత్రాలు విడుదల చేయనున్నారు.

Also Read: Adudam Andhra: ఆడుదాం ఆంధ్రా పనికి మాలిన ప్రోగ్రామ్‌.. రోజా అవినీతిని కక్కిస్తాం


 


గంజాయిపై ఉక్కుపాదం
ఆంధ్రప్రదేశ్‌ పేరును గంజాయి మసకబార్చిన విషయం తెలిసిందే. గంజాయిపై ఉక్కుపాదం మోపాలని మంత్రివర్గం నిర్ణయించింది. గంజాయి నియంత్రణకు హోంమంత్రి అనిత సారథ్యంలో మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటుచేయాలని మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. హోం, రెవెన్యూ, ఆరోగ్య, గిరిజన శాఖ మంత్రులతో ఈ ఉప సంఘం ఏర్పాటుకు నిర్ణయించారు. 


జూలైలో బడ్జెట్‌ సమావేశాలు?
ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం ముగియడంతో వర్షాకాల సమావేశాలతోపాటు బడ్జెట్‌ సమావేశాలు వచ్చే నెలలో నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం కావడంతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter