AP Cabinet 2024: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుండటంతో కేబినెట్ భేటీ కీలక అంశాలకు ఆమోదముద్ర వేసింది. ఓట్ ఆన్ ఎక్కౌంట్ బడ్జెట్‌ను ఆమోదించింది. మరి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా మూడు ప్రైవేట్ వర్శిటీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో నంద్యాల జిల్లా డోన్‌లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న హార్టికల్చర్ ఫుడ్ ప్రోసెసింగ్ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు ఆమోదం లబించింది. డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్శిటీ పరిధిలో ఈ కళాశాల పనిచేస్తుంది. ఇక్కడే వ్యవసాయరంగంలో రెండేళ్ల డిప్లొమా కోర్సుతో పాటు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు సైతం కూడా అనుమతి లభించింది. ఈ కళాశాల ఆచార్య ఎన్‌జి రంగా అగ్రికల్చర్ యూనివర్శిటీ పరిధిలో పనిచేస్తుంది. 


మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్శిటీస్ యాక్ట్ 2016కు సవరమ చేసి బ్రౌన్ ఫీల్డ్ కేటగరీలో మూడు ప్రైవేట్ వర్సిటీలకు ఏపీ కేబినెట్ అనుమతిచ్చింది. అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమాచార్య యూనివర్శిటీ, తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో గైట్ చైతన్యరాజుకు చెందిన గోదావరి గ్లోబల్ యూనివర్శిటీ, కాకినాడ జిల్లా సూరంపాలెంటలో ఆదిత్య శేషారెడ్డికి చెందిన ఆదిత్య యూనివర్శిటీకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 


Also read: AP Elections 2024: ఏపీ ఎన్నికల్లో పొత్తు పొడిస్తే..బీజేపీ ఆశిస్తున్న స్థానాలివే, ఇవాళ అమిత్ షాతో చంద్రబాబు భేటీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook