AP Cabinet: ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రివర్గానికి రంగం సిద్ధమైంది. మరో నాలుగు రోజుల్లో కొత్త మంత్రులు కొలువుదీరనున్నారు. పాత మంత్రులకు ఇవాళే చివరి రోజు. ఎవరు ఇన్..ఎవరు అవుట్..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ కేబినెట్ విస్తరణ రానే వచ్చింది. విస్తరణ అనేకంటే మార్పు అనడం సముచితం. ఎందుకంటే దాదాపు 90 శాతం పైగా కేబినెట్ మారిపోనుంది. ఏప్రిల్ 11వ తేదీన ఏపీ కొత్త కేబినెట్ ఏర్పడనుంది. ఈ క్రమంలో ఇవాళ రాష్ట్రంలోని మొత్తం 25 మంత్రులు రాజీనామా చేయనున్నారు. 4-6 గురు మంత్రులు తిరిగి కొనసాగే అవకాశాలున్నాయి. రాజీనామా చేసిన 25 మంది స్థానంలో 90 శాతం వరకూ మార్పులుండవచ్చు. కొంతమంది పాతవారిని కొనసాగించే అవకాశాలున్నాయి.


ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, గుమ్మనూరు జయరాం, వేణుగోపాల కృష్ణ, సిదిరి అప్పలరాజులు తిరిగి కొనసాగే అవకాశాలున్నాయి. అదే సమయంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, పోలవరం ఎమ్మెల్యే బాలరాజు పేర్లు విన్పిస్తున్నాయి. సిదిరి అప్పలరాజును తప్పిస్తే..ముమ్మిడివరం ఎమ్మెల్యే మత్స్యవర్గానికి చెందిన పొన్నాడ సతీష్ కుమార్‌కు అవకాశం దక్కవచ్చు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల మంత్రులు తానేటి వనిత, ఆళ్ల నాని, కన్నబాబు, విశ్వరూప్‌లను మంత్రివర్గం నుంచి తప్పించి..పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారు. 2024 ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాల్ని సిద్ధం చేసేందుకు సీనియర్ మంత్రుల సేవల్ని వినియోగించుకోనున్నారు. ఈసారి ఎస్టీ కోటాలో ఇద్దరికి అవకాశం దక్కనుంది. ఇందులో ఒక మహిళకు ఛాన్స్ ఉంది. ఇక ఎస్సీ కేటగరీలో మాల వర్గానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో కొత్త ఏలూరు జిల్లా పరిధిలో..దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్ చౌదరి పేరు విన్పిస్తోంది. 80 శాతం అవకాశాలున్నాయి. అటు శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి అవకాశాలున్నాయని తెలుస్తోంది. 


Also read: Jagan Meets Gadkari: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ భేటీ!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook