Jagan Meets Gadkari: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ భేటీ!

CM Jagan Meets Gadkari: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం ఉదయం ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి కావాల్సిన రోడ్డు, పర్యాటక అవసరాలను త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్రమంత్రికి జగన్ విజ్ఞప్తి చేసుకున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 6, 2022, 11:50 AM IST
Jagan Meets Gadkari: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ భేటీ!

CM Jagan Meets Gadkari: కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక రోడ్డు ప్రాజెక్టులపై చర్చించిన సీఎం.. విశాఖ – భోగాపురం బీచ్‌ కారిడర్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరిన్ని మేలైన ఆలోచనలు చేయాలంటూ విన్నవించుకున్నారు. విశాఖ నుంచి వేగంగా భోగాపురం చేరేందుకు సౌకర్యవంతమైన రోడ్డుతోపాటు.. పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దడానికి తగిన సహాయ సహకారాలు అందించాలని సీఎం జగన్ కోరినట్లు తెలుస్తోంది. 

గతంలో ఏపీ పర్యటనకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వచ్చిన సమయంలో అధికారులకు కొన్ని సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. వాటిని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. విజయవాడ వెస్ట్రన్‌ బైసాస్‌ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని.. దీనికి సీఆర్డీయే గ్రిడ్‌ రోడ్డును అనుసంధానం చేసి పనులు ముందుకుసాగేలా చర్యలు తీసుకోవాలని గడ్కరీని కోరారు. వీటితో పాటు నితిన్ గడ్కరీని సీఎం జగన్ విన్నవించుకున్న విషయాలివే! 

1) విజయవాడ వెస్ట్రన్‌ బైపాస్‌కు సంబంధించి మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌కు భూములు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని.. ఈ భూములను కూడా గుర్తించిందని వెంటనే డీపీఆర్‌ సిద్ధం చేసి పనులు ముందుకు తీసుకెళ్లాలని వినతి. 

2) విజయవాడ ఈస్ట్రన్‌ బైపాస్‌కు సంబంధించి కూడా డీపీఆర్‌ సిద్ధంచేసి పనులు వేగవంతంగా చేపట్టేలా తగిన చర్యలు తీసుకోవాలంటూ గడ్కరీని కోరిన సీఎం జగన్. 

3) రాష్ట్రంలో 20 ఆర్వోబీలకు కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఇప్పటికే మంజూరుచేసిందని, మిగిలిన 17 ఆర్వోబీలనూ మంజూరుచేయాలని సీఎం జగన్ విజ్ఞప్తి. 

4) రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను, పారిశ్రామిక నోడళ్లను, స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్లను కలుపుతూ 1723 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అభ్యర్ధన. 

5) కొత్త ఏర్పడ్డ 26 జిల్లాల కేంద్రాలను కలుపుతూ ఈ రోడ్ల నిర్మాణం చేపట్టాలని వినతి. 

6) రాష్ట్రంలో దాదాపు 14 ప్రాంతాల్లో రోప్‌ వే ల నిర్మాణానికి పర్యాటక శాఖ ప్రతిపాదనలు పంపించింది. ఇప్పటికే 2 చోట్ల నిర్మాణానికి అంగీకరించింది. మిగిలిన ప్రతిపాదనలకూ అనుమతి మంజూరుచేయాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని సీఎం జగన్ కోరారు.  

Also Read: CM Jagan Delhi Tour: చర్చనీయాంశంగా మారిన సీఎం జగన్ ఢిల్లీ టూర్..

Also Read: Selvamani Arrest Warrant: వైసీపీ ఎమ్మెల్యే రోజా భర్తపై అరెస్టు వారెంట్.. కారణమదేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News