Land Titling Act: ఏపీ ఎన్నికల్లో అధికార పార్టీని ఇరుకునపెట్టేందుకు ప్రతిపక్షాలకు అస్త్రం లభించింది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై విమర్శలు ప్రారంభించింది. ఈ ఎన్నికల్లో ఈ చట్టం ద్వారా లబ్ది పొందే ప్రయత్నం చేస్తూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు వైఎస్ జగన్ గట్టిగా సమాధానం ఇచ్చారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై కీలక విషయాలు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి ప్రజలకు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు. భూమిపై యజమానికి సర్వహక్కులు కల్పించడమే ల్యాండ్ టైట్లింగ్ చట్టం ఉద్దేశ్యమని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి జిరాక్స్ పేపర్లు ఇస్తారనడం పూర్తిగా అవాస్తవమన్నారు. భూములకు సంబంధించి అతి పెద్ద సంస్కరణ అని చెప్పారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేశామన్నారు. ఈ సంస్కరణ, మార్పులు ఏపీకు మాత్రమే సంబంధించింది కాదని, దేశమంతా జరుగుతోందన్నారు. 


గతంలో ఎప్పుడో వందేళ్ల క్రితం సర్వే జరిగిందని ఇప్పుడు తిరిగి సర్వే జరిపిస్తూ రికార్డులు భద్రం చేస్తున్నామన్నారు. భూమిపై యజమానికి డబుల్ భరోసా ఇచ్చేదే ఈ చట్టమన్నారు. ఇప్పటికే 17 వేల గ్రామాల్లో రికార్డుల వెరిఫికేషన్ పూర్తయిందన్నారు. టైటిల్‌లో తప్పులు లేకుండా చూసి ఏదైనా ఫ్రాడ్ జరిగితే ప్రభుత్వమే ఆ యజమానికి గ్యారంటీ ఇచ్చే చట్టమన్నారు. 


భూమిపై సదరు యజమానికి ఉండే యాజమాన్య హక్కుకు ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీ అని స్పష్టం చేశారు. ఏదైనా క్రయ విక్రయాలు జరిగినప్పుడు ఎవరైనా ఫేక్ టైటిల్ అంటూ క్లెయిమ్ చేస్తే ఇది సరైందేనంటూ ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీ అన్నారు. ఏ విధంగా చదువు, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, సామాజిక న్యాయం, హౌసింగ్ విషయాల్లో సంస్కరణలు తీసుకొస్తున్నామో ఇది కూడా అలాంటిదేనన్నారు. 


ఈ చట్టం ప్రతిపాదన వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ద్వారా సూచించిందేనన్నారు. ఇప్పుడీ చట్టంపై రాద్ధాంతం చేస్తున్న తెలుగుదేశం-జనసేనలు ఇదే ప్రశ్నను వారితో కలిసి తిరుగుతున్న బీజేపీ పెద్దల్ని అడగగలరా అని ప్రశ్నించారు. 


Also read: YS Jagan: ముస్లిం రిజర్వేషన్లకు అడ్డంగా నిలబడతా, బీజేపీతో నో సాఫ్ట్ కార్నర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook