కేంద్రంపై నిప్పులు చెరిగిన ఏపీ సీఎం చంద్రబాబు
కేంద్రంపై నిప్పులు చెరిగిన ఏపీ సీఎం చంద్రబాబు
ఇటీవల కాలంలో కేంద్రం నిర్ణయాలను తప్పుపడుతూ వీలు చిక్కినప్పుడల్లా కేంద్రం వైఖరిని వేలెత్తిచూపుతున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా మరోసారి కేంద్రంపై మండిపడ్డారు. తిత్లి తుఫాన్ అనంతరం ఆంధ్రాకు జరిగిన నష్టాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ లో వివరించా. రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలతో లేఖ కూడా రాశాను. కానీ మోదీ నుంచి ఎలా స్పందన లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వమే యుద్ధ ప్రాతిపదికన అహర్నిశలు శ్రమించి బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు కృషిచేసింది. వేగంగా నష్ట నివారణ చర్యలు చేపట్టి.. కేవలం 12 రోజుల్లోనే మళ్లీ అక్కడ పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చినట్టు చంద్రబాబు తెలిపారు.