Andhra Pradesh: సీఎం జగన్ ఒక ఫేక్: మాజీ టీడీపీ ఎమ్మెల్యే సుగుణమ్మ
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెల్సిందే. కానీ చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం సీఎం జగన్ తెలియదు అని చెప్పటంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మండిపడ్డారు.
Andhra Pradesh: మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్టు చేసి రాక్షసానందం పొందుతున్నారని.. చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు తాను రాష్టంలోలేనని, లండన్లో ఉన్నానని, తనకేమీ తెలియదని జగన్మోహన్ రెడ్డి చెప్పడం అయన ఒక ఫేక్ సీఎం అనడానికి నిదర్శ నమని టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆరోపించారు.
తిరుపతిలోని మాజీ ఎమ్మెల్యే ఇంటి వద్ద జరిగిన మీడియా సమావేశంలో సుగుణమ్మ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అసమర్థ పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడి అరెస్టు తెలియదని చెప్పడం అబద్దం అని అన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియకపోవడం ఒక ఫేక్ ముఖ్యమంత్రికి నిదర్శనమని ఆరోపించారు.
సీఎంకు తెలియకుండానే మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుని అరెస్ట్ చేసారా..? అని ఎద్దేవా చేశారు. ఇదంతా జగన్ ఆడుతున్న డ్రామా అని.. చంద్రబాబు అరెస్టుతో వైసీపీ క్యాడర్లో నిరుత్సాహం నెలకొంది. దానినుండి బయటపడేందుకే సీఎం జగన్ ఆత్మీయ సమావేశం పెట్టి కల్లబొల్లి మాటలు మాట్లాడారని అన్నారు. చంద్రబాబు అరెస్టుతోనే, రాష్ట్రంలో వైసీపీ పతనం ప్రారంభమైందని సుగుణమ్మ పేర్కొన్నారు.
Also Read: Asia Richest Person 2023: హారున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023, ఆసియా కుబేరుడు అంబానీనే
తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతోనే తిరుపతిలో అనేక అభివృద్ధికార్యక్రమాలు, జరుగుతున్నాయని పేర్కొన్నారు. అయితే టీటీడీ బడ్జెట్లో ఒక శాతం నిధులు తిరుపతి అభివృద్ధికి కేటాయిస్తున్నట్లు పాలక మండలి నిర్ణయించాడాన్ని ఆమె తప్పు పట్టారు. టీటీడీ నిధులను కాజేయాలన్నసంకల్పంతోనే, టీటీడీ చైర్మన్ ను కప్పం కట్టడం కోసమే, శ్రీవారి ఖజానానుండి ఒక శాతం నిధులు దారి మళ్ళించారని ఆమెరోపించారు. ఈ విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు నరసింహ యాదవ్, ఆర్సి మునికృష్ణ, శ్రీధర్వర్మ, సూరా సుధాకర్ రెడ్డి, చిన్న బాబు,రజనీ కాంత్, మహేష్ యాదవ్, తులసి, సురేంద్రబాబు హనుమంతనాయుడు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Low BP Remedies: నిర్లక్ష్యం చేస్తే లో బీపీ ప్రాణం తీయవచ్చు, ఈ 3 చిట్కాలతో ఇట్టే మాయ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి