ఇటీవల ప్రభుత్వ విధానాలపై, ప్రభుత్వ పనితీరుపై విమర్శలు సంధిస్తున్న వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. త్వరలో ఆయనపై వేటుపడే అవకాశాలు కన్పిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నర్శాపురం ఎంపీగా వైసీపీ టికెట్‌పై గెలిచిన రఘు రామకృష్ణంరాజు పార్టీ రెబెల్ ఎంపీగా మారిన పరిస్థితి తెలిసిందే. నేరుగా టీడీపీతో బంధం కొనసాగిస్తున్నారు. ఇప్పుడు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి అదే బాటలో పయనిస్తున్నారు. ఇటీవల వరుసగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. పెన్షన్లు ఇస్తే ఓట్లు రాలవని..అలాగైతే గత ప్రభుత్వం కూడా పెన్షన్లు ఇచ్చిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.


నాలుగేళ్లలో ఏం చేశామని ప్రజలను ఓట్లు అడగాలని వ్యాఖ్యానించిన ఆనం రాంనారాయణ రెడ్డి..రోడ్లపై పడిన గోతులను కూడా పూడ్చలేని పరిస్థితిలో ఉన్నామన్నారు. గ్రామ సచివాలయాలకు భవనాలు లేవని, అద్దె భవనాలు, అంగన్ వాడీ కార్యాలయాల్లో నడుపుతున్నారని విమర్శించారు. 


ఆనంపై సీఎం జగన్ సీరియస్, వేటు తప్పదు


ఆనం రాంనారాయణ రెడ్డి వైఖరిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ పరంగా ఆయనపై వేటు పడే అవకాశాలు కన్పిస్తున్నాయి.
గత కొంత కాలంగా ప్రభుత్వం, పార్టీపై విమర్శలు చేస్తున్న ఆనం రామనారాయణ రెడ్డిని ఇక ఉపేక్షించి లాభం లేదనే నిర్ణయానికి పార్టీ హైకమాండ్ వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ ఇన్‌ఛార్జ్‌గా ఆయనను తొలగించి..మరొకరిని నియమించే ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. తిరుపతి జిల్లా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నేదురుమిల్లి జనార్ధన్ రెడ్డి కుమారుడు రామ్‌కుమార్ రెడ్డిని నియమించే అవకాశాలు కన్పిస్తున్నాయి.


మరోవైపు ఆనం రాంనారాయణ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిలు తీవ్రంగా స్పందించారు. ఓట్ల కోసం పెన్షన్లు ఇవ్వడం లేదని..ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి పింఛన్లు ఇస్తున్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. ముందస్తు ఎన్నికలొస్తాయని ఆనం రాంనారాయణ రెడ్డి జోస్యం చెప్పించుకున్నారా అని ఎద్దేవా చేశారు. 


Also read: YSRCP: చంద్రబాబు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ సీపీ డిమాండ్.. సరికొత్త నిరసనకు పిలుపు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook