ఏపీలో కరోనా వైరస్(AP CoronaVirus Cases) తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 813 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, ఇందులో రాష్ట్రంలో ఉన్నవారికి 755 మందికి కరోనా సోకగా, మిగతా 58 కేసులు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో నిర్ధారించారు. తాజా కేసులతో కలిపితే ఏపీలో కరోనా కేసులు 13,098కు చేరుకున్నాయి. కటింగ్ చేయించుకోవాలంటే అపాయింట్‌మెంట్!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల(CoronaVirus Cases In Andhra Pradesh)కు గాను 5,908 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 7,021 కోవిడ్19 యాక్టీవ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో ఏకంగా 12 మంది కరోనాతో మరణించారు. ఇప్పటివరకూ ఏపీలో మొత్తం 169 మందిని కరోనా మహమ్మారి బలి తీసుకుంది. నటి డ్యాన్స్‌కు 24గంటల్లోనే 40 మిలియన్ల వ్యూస్


ఏపీలో గడిచిన 24 గంటల్లో 25,778 శాంపిల్స్ పరీక్షించగా మొత్తం 813 మందికి కోవిడ్19(COVID-19) పాజిటివ్‌గా నిర్ధారించారు. అదే సమయంలో 401 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కరు చొప్పున కరోనాతో మరణించారు. హాట్ ఫొటోలతో యాంకర్ Varshini రచ్చరచ్చ!


నేటి వరకు రాష్ట్రంలో మొత్తం 8,41,860 శాంపిల్స్ పరీక్షించగా ఏపీ నుంచి 10,848 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వచ్చినవారిలో 1,865 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో 385 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ఈ వివరాలు వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..   
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ