ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 10,093 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపితే జులై 29 నాటికి ఏపీలో మొత్తం కరోనా కేసులు (AP CoronaVirus Positive Cases) 1,20,390కు చేరుకున్నాయి. 65 మంది కోవిడ్19 మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు. ఏపీలో ఇప్పటివరకూ కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,213కి చేరింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

------------------------------------------------


ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 7,948 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపితే జులై 28 నాటికి ఏపీలో మొత్తం కరోనా కేసులు (AP CoronaVirus Positive Cases) 1,10,297కు చేరుకున్నాయి. రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులకు గాను 52,622 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 56,527 కరోనా యాక్టీవ్ కేసులున్నాయి.


గడిచిన 24 గంటల్లో ఏపీలో ఏకంగా 58  మంది కోవిడ్19 మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు. ఏపీలో ఇప్పటివరకూ కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,148కి చేరింది. ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ నేటి సాయంత్రం ఈ బులెటిన్ విడుదల చేసింది.


--------------------------------------------------------


గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో (జులై 17 నాటికి) 2,602 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఏపీలో కరోనా కేసులు (AP CoronaVirus Cases) 40,646కు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో ఏకంగా 42  మంది కరోనాతో మరణించారు. ఏపీలో ఇప్పటివరకూ కరోనాతో మరణించిన వారి సంఖ్య 534కి చేరింది.


తాజాగా అనంతపురంలో ఆరుగురు, చిత్తూరులో ఐదుగురు, తూర్పు గోదావరిలో ఐదుగురు, ప్రకాశంలో ఐదుగురు, గుంటూరులో నలుగురు, పశ్చిమ గోదావరిలో నలుగురు, కడపలో ముగ్గురు, విశాఖపట్నంలో ముగ్గురు, కర్నూలులో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు, కృష్ణాలో ఒక్కరు కరోనా(COVID19) బారిన పడి చనిపోయారు. అదే సమయంలో 837 మంది కరోనా నుంచి కోలుకున్నారు.  
---------------


గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2,593 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, ఇందులో రాష్ట్రంలో ఉన్నవారికి 2,584 మందికి కరోనా నిర్ధారించారు. తాజా కేసులతో కలిపితే ఏపీలో కరోనా కేసులు (AP CoronaVirus Cases) 38,044కు చేరుకున్నాయి. మొత్తం కేసులకు గాను 19,393 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 18,159 కరోనా యాక్టీవ్ కేసులున్నాయి. తాజాగా 40  కరోనా మరణాలు సంభవించాయి. ఏపీలో ఇప్పటివరకూ కరోనాతో మరణించిన వారి సంఖ్య 492కి చేరింది.


తాజాగా తూర్పు గోదావరిలో 8 మంది, ప్రకాశంలో 8, చిత్తూరులో ఐదుగురు, కడపలో నలుగురు, అనంతపురంలో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, విశాఖపట్నంలో ముగ్గురు, కర్నూలు‌లో ఒక్కరు, శ్రీకాకుళంలో ఒక్కరు, విజయనగరంలో ఒక్కరు చొప్పున కోవిడ్19 బారిన పడి చనిపోయారు.  అదే సమయంలో 943 మంది కరోనా నుంచి కోలుకున్నారు.


----------------------------------------------------------


ఏపీలో గడిచిన 24 గంటల్లో 2,432 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపితే జులై 15న ఏపీలో కరోనా కేసులు (AP CoronaVirus Cases) 35,451కు చేరుకున్నాయి. మొత్తం పాజిటివ్ కేసులకుగాను 18,378 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 16,621 కరోనా యాక్టీవ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో ఏకంగా 44  కరోనా మరణాలు సంభవించాయి. ఏపీలో ఇప్పటివరకూ కరోనాతో మరణించిన వారి సంఖ్య 452కి చేరింది.

తాజాగా అనంతపురంలో 9 మంది, ప.గోదావరిలో 9 మంది, కర్నూలు జిల్లాలో ఐదుగురు, చిత్తూరులో నలుగురు, తూర్పు గోదావరిలో నలుగురు, విశాఖపట్నంలో నలుగురు, కడపలో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, నెల్లూరులో ఒక్కరు, శ్రీకాకుళంలో ఒక్కరు, విజయనగరంలో ఒక్కరు చొప్పున ప్రాణాంతక కరోనాతో పోరాడుతూ మరణించారు. అదే సమయంలో 805 మంది కరోనా నుంచి కోలుకున్నారు.


---------------------------------------------------------


గడిచిన 24 గంటల్లో ఏపీలోలో 1,916 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపితే జులై 14న ఏపీలో కరోనా కేసులు (AP CoronaVirus Cases) 33,019కు చేరుకున్నాయి. మొత్తం పాజిటివ్ కేసులకు గాను 17,467 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 15,144 కరోనా యాక్టీవ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో ఏకంగా 43  కరోనా మరణాలు సంభవించాయి. ఏపీలో ఇప్పటివరకూ కరోనాతో మరణించిన వారి సంఖ్య 408కి చేరింది.

తాజాగా అనంతపురంలో 10 మంది, ప.గోదావరిలో 9 మంది, చిత్తూరులో ఐదుగురు, తూర్పు గోదావరిలో ఐదుగురు, కడపలో ఐదుగురు, కర్నూలు జిల్లాలో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, విశాఖపట్నంలో ఇద్దరు, విజయనగరంలో ఒక్కరు చొప్పున ప్రాణాంతక కరోనాతో పోరాడుతూ మరణించారు. ఏపీలో గడిచిన 24 గంటల్లో 22,670 శాంపిల్స్ పరీక్షించగా మొత్తం 1,916 మందికి కోవిడ్19 పాజిటివ్‌గా నిర్ధారించారు. అదే సమయంలో 952 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
------------------------------------------------------


గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,608 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, ఇందులో రాష్ట్రంలో ఉన్నవారికి 1576 మందికి కరోనా సోకగా, మిగతా 32 కేసులు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో నిర్ధారించారు. తాజా కేసులతో కలిపితే జులై 10 నాటికి ఏపీలో కరోనా కేసులు (AP CoronaVirus Cases) 25,422కు చేరుకున్నాయి. 


రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులకు గాను 13,194 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 11,936 కోవిడ్19 యాక్టీవ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో 15 కరోనా మరణాలు సంభవించాయి. ఏపీలో ఇప్పటివరకూ కరోనాతో మరణించిన వారి సంఖ్య 292కి చేరింది.
-------------------------------------


గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,555 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపితే ఏపీలో కరోనా కేసులు (AP CoronaVirus Cases) 23,814కు చేరుకున్నాయి. మొత్తం పాజిటివ్ కేసులకు గాను 12,154 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 11,383 కోవిడ్19 యాక్టీవ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో 13 కరోనా మరణాలు సంభవించాయి. ఏపీలో ఇప్పటివరకూ కరోనాతో మరణించిన వారి సంఖ్య 277కి చేరింది. 


తాజాగా కర్నూలు జిల్లాలో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, కృష్ణాలో ఒక్కరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కరు, చిత్తూరులో ఒక్కరు చొప్పున కోవిడ్19 బారిన పడి మరణించారు. 
--------------------------------------------


ఏపీలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,062 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, ఇందులో రాష్ట్రంలో ఉన్నవారికి 1051 మందికి కరోనా సోకగా, మిగతా 11 కేసులు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో నిర్ధారించారు. తాజా కేసులతో కలిపితే జులై 8 నాటికి ఏపీలో కరోనా కేసులు (AP CoronaVirus Cases) 22,259కు చేరుకున్నాయి.     

తాజాగా కర్నూలు జిల్లాలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు, చిత్తూరులో ఒక్కరు, గుటూరులో ఒక్కరు, విశాఖ జిల్లాలో ఒక్కరు చొప్పున కోవిడ్19 బారిన పడి మరణించారు. ఏపీలో ఇప్పటివరకూ కరోనాతో మరణించిన వారి సంఖ్య 264కి చేరింది.
-------------------------------------


ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,178 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, ఇందులో రాష్ట్రంలో ఉన్నవారికి 1155 మందికి కరోనా సోకగా, మిగతా 23 కేసులు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో నిర్ధారించారు. తాజా కేసులతో కలిపితే ఏపీలో కరోనా కేసులు (AP CoronaVirus Cases) 21,197కు చేరుకున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో నలుగురు, అనంతపురంలో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, విశాఖ జిల్లాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఒక్కరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కరు చొప్పున కోవిడ్19 బారిన పడి 13 మంది మరణించారు. Full Article:  ఏపీలో ఒక్కరోజే ఏకంగా 762 మంది డిశ్ఛార్జ్  
-----------------


ఏపీలో గడిచిన 24 గంటల్లో 1,322 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, ఇందులో రాష్ట్రంలో ఉన్నవారికి 1263 మందికి కరోనా సోకగా, మిగతా 59 కేసులు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో నిర్ధారించారు. తాజా కేసులతో కలిపితే ఏపీలో కరోనా కేసులు (AP CoronaVirus Cases) 20,019కు చేరుకున్నాయి.  


తాజాగా కర్నూలు శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు, అనంతపురంలో ఒక్కరు, చిత్తూరులో ఒక్కరు, కృష్ణా జిల్లాలో ఒక్కరు, గుంటూరులో ఒక్కరు, విశాఖ జిల్లాలో ఒక్కరు చొప్పున కరోనా సోకి చనిపోయారు. 


ఇప్పటివరకూ ఏపీలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 239కి చేరింది. అదే సమయంలో 424 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులకు గాను 8,920 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 10,860 కోవిడ్19 యాక్టీవ్ కేసులున్నాయి.
_____________________-


గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 998 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, ఇందులో రాష్ట్రంలో ఉన్నవారికి 961 మందికి కరోనా సోకగా, మిగతా 37 కేసులు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో నిర్ధారించారు. తాజా కేసులతో కలిపితే ఏపీలో జులై 5 నాటికి కరోనా కేసులు 18,697కు చేరుకున్నాయి. 


రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులకు గాను 8,422 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 10,043 కోవిడ్19 యాక్టీవ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో ఏకంగా 14 మంది వ్యక్తులు కరోనాతో మరణించారు. ఇప్పటివరకూ ఏపీలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 232కి చేరింది. తాజాగా కర్నూలు జిల్లాలో అయిదుగురు, అనంతపురంలో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, కడపలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఒక్కరు, విశాఖ జిల్లాలో ఒక్కరు చొప్పున కరోనాతో చనిపోయారు. 
___________________________________________


ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 837 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఉన్నవారికి 789 మందికి కరోనా సోకగా, 48 కేసులు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో నిర్ధారించారు. తాజా కేసులతో కలిపితే జులై 3 నాటికి ఏపీలో కరోనా కేసులు 16,934కు చేరుకున్నాయి. ఏపీలో కరోనా మరణాలు 200 దాటిపోయాయి.


ఏపీలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులకు గాను 7,632 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 9,096 కోవిడ్19 యాక్టీవ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో 8 మంది వ్యక్తులు కరోనాతో మరణించారు. ఇప్పటివరకూ ఏపీలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 206కి చేరింది.


--------------------------
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 845 కరోనా పాజిటివ్ కేసులు(CoronaVirus) నమోదయ్యాయి. కాగా, ఇందులో రాష్ట్రంలో ఉన్నవారికి 812 మందికి కరోనా సోకగా, మిగతా 33 కేసులు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో నిర్ధారించారు. తాజా కేసులతో కలిపితే ఏపీలో జులై 3 నాటికి కరోనా కేసులు (AP COVID19 Cases) 16,097కు చేరుకున్నాయి. 


మొత్తం పాజిటివ్ కేసులకుగాను 7,313 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 8,586 కోవిడ్19 యాక్టీవ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో అయిదుగురు వ్యక్తులు కరోనాతో పోరుడుతూ మరణించారు. ఇప్పటివరకూ ఏపీలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 198కి చేరింది.
----------------------------------------------------


ఏపీలో కరోనా వైరస్ తీవ్ర ప్రభావం భారీగానే ఉంది. వైఎస్ జగన్ సర్కార్ పటిష్ట చర్యలు తీసుకుంటున్నా రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 657 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, ఇందులో రాష్ట్రంలో ఉన్నవారికి 611 మందికి కరోనా సోకగా, మిగతా 46 కేసులు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో నిర్ధారించారు. తాజా కేసులతో కలిపితే ఏపీలో కరోనా కేసులు 15,252కు చేరుకున్నాయి.


గత 24 గంటల్లో ఏపీలో ఆరుగురు కరోనాతో పోరుడుతూ మరణించారు. తాజాగా కర్నూలు జిల్లాలో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు కరోనా మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు. ఏపీలో గడిచిన 24 గంటల్లో 28,239 శాంపిల్స్ పరీక్షించగా మొత్తం 657 మందికి కోవిడ్19 పాజిటివ్‌గా నిర్ధారించారు. అదే సమయంలో 342 మంది ప్రాణాంతక కరోనా బారి నుంచి కోలుకున్నారు. 


------------------------------


ఏపీలో కరోనా వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 793 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, ఇందులో రాష్ట్రంలో 706 మందికి కరోనా సోకగా, మిగతా 87 కేసులు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో నిర్ధారించారు. తాజా కేసులతో కలిపితే ఏపీలో కరోనా కేసులు 13,891కు చేరుకున్నాయి.


రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులకు గాను 6232 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 7,429 కోవిడ్19 యాక్టీవ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో ఏకంగా 11 మంది కరోనాతో మరణించారు. ఇప్పటివరకూ ఏపీలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 180కి చేరింది.
__________


AP CoronaVirus Cases | ఏపీలో కరోనా వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. గడిచిన 24 గంటల్లో (జూన్ 19 నాటికి) రాష్ట్రంలో 813 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, ఇందులో రాష్ట్రంలో ఉన్నవారికి 755 మందికి కరోనా సోకగా, మిగతా 58 కేసులు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో నిర్ధారించారు. తాజా కేసులతో కలిపితే ఏపీలో కరోనా కేసులు 13,098కు చేరుకున్నాయి.


రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులకు గాను 5,908 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 7,021 కోవిడ్19 యాక్టీవ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో ఏకంగా 12 మంది కరోనాతో మరణించారు. ఇప్పటివరకూ ఏపీలో మొత్తం 169 మందిని కరోనా మహమ్మారి బలి తీసుకుంది.


------------------------


ఏపీలో కరోనా వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. గడిచిన 24 గంటల్లో (జూన్ 19 నాటికి) రాష్ట్రంలో 553 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, ఇందులో 447 కేసులు రాష్ట్రంలో ఉన్నవారికి కాగా, మిగతా 76 కేసులు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో నిర్ధారించారు. తాజా కేసులతో కలిపితే ఏపీలో కరోనా కేసులు 10,884కు చేరుకున్నాయి.


రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులకు గాను 4,988 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 5,769 యాక్టీవ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో ఏకంగా 7 మంది కరోనాతో మరణించారు. ఇప్పటివరకూ ఏపీలో మొత్తం 136 మందిని కరోనా మహమ్మారి బలి తీసుకుంది.


-----------------------------------


ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 465 కరోనా పాజిటివ్ కేసులు (జూన్ 19 నాటికి) నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 7,961కి చేరింది. తాజాగా నలుగురు వ్యక్తులు కరోనాతో మరణించారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కరు చొప్పున కరోనా కాటుకు బలయ్యారు. తాజా మరణాలతో కలిపి ఏపీలో కోవిడ్19 బారిన పడి మరణించిన వారి సంఖ్య 96కి చేరింది.


 


తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా పాజిటీవ్ కేసులు భారీగానే నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఏపీలో తాజాగా 193 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, మొత్తం కరోనా బాధితుల సంఖ్య 5280కి చేరుకుంది. ఏపీ ప్రభుత్వం మాత్రం ప్రతిరోజూ దాదాపు 10వేలకు తగ్గకుండా శాంపిల్స్ సేకరించి టెస్టులు నిర్వహిస్తోంది.


ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 193 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ఏపీలో ఇప్పటివరకూ నమోదైన కేసుల సంఖ్య 5280కి చేరింది. తాజాగా ఇద్దరు కరోనాతో మరణించారు. అదే సమయంలో 81 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. ఏపీలో కరోనా కాటుకు మొత్తం 88 మంది బలయ్యారు. మొత్తం కేసులకుగానూ 2,851 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 2,341 యాక్టీవ్ కేసులున్నాయని ఏపీ వైద్యశాఖ జూన్ 16న హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.


కాగా, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారి కరోనా కేసులు సైతం భారీగానే ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 1203 పాజిటివ్ కేసులు, విదేశాల నుంచి వచ్చిన వారిలో 237 మందికి ఇప్పటివరకూ కోవిడ్19 పాజిటివ్‌గా నిర్ధారించారు.


 ----------------------    
ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 98 మందికి కరోనా వైరస్ సోకింది. ఏపీలో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసులు సంఖ్య 3042కి చేరుకోగా, చికిత్స అనంతరం కరోనా బారి నుంచి కోలుకుని 2,135 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. తాజాగా చిత్తూరు, కృష్ణా జిల్లాలో ఒక్కో కరోనా మరణం నమోదైంది. ఏపీలో మొత్తం కరోనా మరణాలు 62కు చేరుకున్నాయి. 



-----------------------------------------------------


ఏపీలో మే 29 నాటికి కరోనా వివరాలిలా..     
ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 33 మందికి కరోనా వైరస్ సోకింది. ఏపీలో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసులు సంఖ్య 2874కి చేరుకోగా, చికిత్స అనంతరం కరోనా బారి నుంచి కోలుకుని 2037 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. తాజాగా కర్నూలు జిల్లాలో ఓ కరోనా మరణం నమోదైంది. తాజాగా నమోదైన కేసుల్లో 6గురు తమిళనాడులోని కోయంబేడు నుంచి వచ్చినవారు ఉన్నారు.



--------------------------------------------------


ఏపీలో మే 26 నాటికి కరోనా వివరాలిలా..     
ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 48 మందికి కరోనా వైరస్ సోకింది. ఏపీలో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసులు సంఖ్య 2719కి చేరుకోగా, చికిత్స అనంతరం కరోనా బారి నుంచి కోలుకుని 1903 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో ఓ కరోనా మరణం నమోదైంది. 



గడిచిన 24 గంటల్లో మొత్తం 8148 శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించగా 48 మందికి పాజిటివ్‌గా తేలింది. తాజా మరణంతో కలిపి ఏపీలో ఇప్పటివరకూ కరోనా బారిన పడి 57 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 759 యాక్టీవ్ కేసులున్నాయి. బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి


-------------------------------------------------


ఏపీలో మే 25 నాటికి కరోనా వివరాలిలా.. 


ఏపీలో తాజాగా 44 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మొత్తం 10,240 శాంపిల్స్ సేకరించి పరీక్షించినట్లు ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో 44 శాంపిల్స్ కోవిడ్19 పాజిటివ్‌గా తేలినట్లు వైద్యులు నిర్దారించారు. వీటితో కలిపి ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,671కి చేరింది.



నిన్న ఒక్కరోజే కరోనా చికిత్స తీసుకుని 41 మంది పూర్తి ఆరోగ్యంతో వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 1848కి చేరుకుంది. మరోవైపు కరోనా మహమ్మారి కాటుతో 56 మంది మృతి చెందారు. రాష్ట్రంలోని పలు ఆస్పత్రుల్లో 767 యాక్టీవ్ కేసులున్నాయి.


---------------------------------------


ఏపీలో మే 18 నాటికి కరోనా వివరాలిలా.. 


జిల్లాలు  కేసులు డిశ్ఛార్జ్ మృతి
1. అనంతపురం  122 73 04
2. చిత్తూరు * 192 82 -
3. తూ.గోదావరి 57 43 -
4. గుంటూరు 417 315 08
5. కడప 104 69 -
6. కృష్ణా 382 263 15
7. కర్నూలు 615 433 19
8. నెల్లూరు * 157 94 03
9. ప్రకాశం 66 63 -
10. శ్రీకాకుళం 14 04 -
11. విశాఖపట్నం 76 37 01
12. విజయనగరం 08 00 -
13. ప.గోదావరి 72 51 -
మొత్తం 2,282 1,527 50

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 2200 దాటిపోయాయి. తాజాగా ఏపీలో 52 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 2282కి చేరాయని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకూ కోవిడ్19 బారిన పడి 50 మంది బలయ్యారు. 


---------------------------------------
ఏపీలో మే 16 నాటికి కరోనా వివరాలిలా.. 


జిల్లాలు  కేసులు డిశ్ఛార్జ్ మృతి
1. అనంతపురం * 122 93 04
2. చిత్తూరు * 173 77 -
3. తూ.గోదావరి 52 38 -
4. గుంటూరు 413 257 08
5. కడప 102 65 -
6. కృష్ణా 367 211 14
7. కర్నూలు 608 390 19
8. నెల్లూరు * 149 81 03
9. ప్రకాశం 63 63 -
10. శ్రీకాకుళం 07 04 -
11. విశాఖపట్నం 72 26 01
12. విజయనగరం 07 00 -
13. ప.గోదావరి 70 48 -
మొత్తం 2,205 1,353 49

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 2200 దాటిపోయాయి. తాజాగా ఏపీలో 48 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 2205కి చేరాయని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకూ కోవిడ్19 బారిన పడి 49 మంది బలయ్యారు. 


---------------------------------------


ఏపీలో మే 15 నాటికి కరోనా వివరాలిలా.. 


జిల్లాలు  కేసులు డిశ్ఛార్జ్ మృతి
1. అనంతపురం * 122 56 04
2. చిత్తూరు * 165 77 -
3. తూ.గోదావరి 52 35 -
4. గుంటూరు 404 257 08
5. కడప 101 63 -
6. కృష్ణా 360 206 14
7. కర్నూలు 599 343 18
8. నెల్లూరు * 140 81 03
9. ప్రకాశం 63 60 -
10. శ్రీకాకుళం 07 04 -
11. విశాఖపట్నం 66 25 01
12. విజయనగరం 07 00 -
13. ప.గోదావరి 69 45 -
మొత్తం 2,157 1,252 48

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 2100 దాటిపోయాయి. తాజాగా ఏపీలో 57 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 2157కి చేరాయని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకూ కోవిడ్19 బారిన పడి 48 మంది బలయ్యారు. 


---------------------------------------


ఏపీలో మే 14 నాటికి కరోనా వివరాలిలా.. 


జిల్లాలు  కేసులు డిశ్ఛార్జ్ మృతి
1. అనంతపురం 118 52 04
2. చిత్తూరు * 151 77 -
3. తూ.గోదావరి 51 35 -
4. గుంటూరు 404 246 08
5. కడప 99 56 -
6. కృష్ణా 351 203 14
7. కర్నూలు 591 316 18
8. నెల్లూరు * 126 78 03
9. ప్రకాశం 63 60 -
10. శ్రీకాకుళం 07 04 -
11. విశాఖపట్నం 66 25 01
12. విజయనగరం 04 00 -
13. ప.గోదావరి * 69 40 -
మొత్తం 2,100 1,192 48

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 2100 దాటిపోయాయి. తాజాగా ఏపీలో 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 2173కి చేరాయి. అయితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి కేసులు తీసేస్తే ఏపీలో కేసులు 2100 ఉన్నాయని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకూ కోవిడ్19 బారిన పడి 48 మంది బలయ్యారు. 


---------------------------------------


ఏపీలో మే 13 నాటికి కరోనా వివరాలిలా.. 


జిల్లాలు  కేసులు డిశ్ఛార్జ్ మృతి
1. అనంతపురం 118 49 04
2. చిత్తూరు 142 74 -
3. తూ.గోదావరి 51 35 -
4. గుంటూరు 399 225 08
5. కడప 97 56 -
6. కృష్ణా 349 202 14
7. కర్నూలు 591 297 17
8. నెల్లూరు 111 77 03
9. ప్రకాశం 63 60 -
10. శ్రీకాకుళం 05 04 -
11. విశాఖపట్నం 66 25 01
12. విజయనగరం 04 00 -
13. ప.గోదావరి 68 38 -
14. ఇతరులు 73 - -
మొత్తం 2,137 1,142 47

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 2100 దాటిపోయాయి. తాజాగా ఏపీలో 48 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 2137కి చేరాయి. తాజాగా 9 వేల  శాంపిల్స్ పరీక్షించగా అందులో 48 మందికి కోవిడ్19 పాజిటివ్‌గా తేలింది. రాష్ట్రంలో  ఇప్పటివరకూ కోవిడ్19 బారిన పడి 47 మంది బలయ్యారు. గుజరాత్ వలసకూలీలతో, ఇటీవల తమిళనాడు నుంచి వచ్చిన వారు 73 మందికి పాజిటివ్‌గా తేలింది. ఈ వివరాలను ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది.


---------------------------------------


ఏపీలో మే 12 నాటికి కరోనా వివరాలిలా.. 


జిల్లాలు  కేసులు డిశ్ఛార్జ్ మృతి
1. అనంతపురం 115 48 04
2. చిత్తూరు 131 74 -
3. తూ.గోదావరి 47 31 -
4. గుంటూరు 387 198 08
5. కడప 97 46 -
6. కృష్ణా 346 177 14
7. కర్నూలు 584 284 16
8. నెల్లూరు 111 76 03
9. ప్రకాశం 63 60 -
10. శ్రీకాకుళం 05 03 -
11. విశాఖపట్నం 66 25 01
12. విజయనగరం 04 00 -
13. ప.గోదావరి 68 33 -
14. ఇతరులు 27 - -
మొత్తం 2,051 1,056 46

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 2 వేలు దాటిపోయాయి. తాజాగా ఏపీలో 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 2018కి చేరాయి. తాజాగా 10,730  శాంపిల్స్ పరీక్షించగా అందులో 33 మందికి కోవిడ్19 పాజిటివ్‌గా తేలింది. రాష్ట్రంలో  ఇప్పటివరకూ కోవిడ్19 బారిన పడి 46 మంది బలయ్యారు.


---------------------------------------


ఏపీలో మే 11 నాటికి కరోనా వివరాలిలా.. 


జిల్లాలు  కేసులు డిశ్ఛార్జ్ మృతి
1. అనంతపురం 115 45 04
2. చిత్తూరు 121 74 -
3. తూ.గోదావరి 46 31 -
4. గుంటూరు 387 198 08
5. కడప 97 45 -
6. కృష్ణా 342 142 13
7. కర్నూలు 575 267 16
8. నెల్లూరు 102 76 03
9. ప్రకాశం 63 60 -
10. శ్రీకాకుళం 05 02 -
11. విశాఖపట్నం 66 25 01
12. విజయనగరం 04 00 -
13. ప.గోదావరి 68 33 -
14. ఇతరులు 27 - -
మొత్తం 2,018 998 46

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 2 వేలు దాటిపోయాయి. తాజాగా ఏపీలో 33 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 2051కి చేరాయి. తాజాగా 7,409 శాంపిల్స్ పరీక్షించగా అందులో 38 మందికి కోవిడ్19 పాజిటివ్‌గా తేలింది. 


---------------------------------------
ఏపీలో మే 10 నాటికి కరోనా వివరాలిలా.. 


 


జిల్లాలు  కేసులు డిశ్ఛార్జ్ మృతి
1. అనంతపురం 107 45 04
2. చిత్తూరు 112 74 -
3. తూ.గోదావరి 46 31 -
4. గుంటూరు 382 176 08
5. కడప 97 43 -
6. కృష్ణా 339 137 13
7. కర్నూలు 566 239 16
8. నెల్లూరు 101 62 03
9. ప్రకాశం 63 60 -
10. శ్రీకాకుళం 05 00 -
11. విశాఖపట్నం 63 25 01
12. విజయనగరం 04 00 -
13. ప.గోదావరి 68 33 -
14. ఇతరులు 27 - -
మొత్తం 1,980 925 45

 


---------------------------------------


ఏపీలో మే 8 నాటికి కరోనా వివరాలిలా.. 


జిల్లాలు  కేసులు డిశ్ఛార్జ్ మృతి
1. అనంతపురం 99 42 04
2. చిత్తూరు 84 74 -
3. తూ.గోదావరి 46 26 -
4. గుంటూరు 374 164 08
5. కడప 96 43 -
6. కృష్ణా 322 126 11
7. కర్నూలు 547 191 14
8. నెల్లూరు 96 60 03
9. ప్రకాశం 61 60 -
10. శ్రీకాకుళం 05 00 -
11. విశాఖపట్నం 57 23 01
12. విజయనగరం 04 00 -
13. ప.గోదావరి 68 33 -
14. ఇతరులు 27 - -
మొత్తం 1,887 842 41

విశాఖలో తొలి కరోనా మరణం నమోదైంది. గ్యాస్ లీకేజీతో సతమతమవుతున్న విశాఖ నగరవాసులకు ఇది పిడుగులాంటి వార్తే. గడిచిన 24 గంటల్లో మరో 54 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 1,887కి చేరింది. మొత్తం పాటిజివ్ కేసులకుగానూ చికిత్స అనంతరం కోలుకుని 842 మంది డిశ్ఛార్జ్ కాగా, ఏపీలో కరోనా బారిన పడి ఇప్పటివరకూ 41 మంది మరణించారు.


--------------------------------------------


ఏపీలో మే 7 నాటికి కరోనా వివరాలిలా..   


జిల్లాలు  కేసులు డిశ్ఛార్జ్ మృతి
1. అనంతపురం 83 39 04
2. చిత్తూరు 82 68 -
3. తూ.గోదావరి 46 26 -
4. గుంటూరు 373 150 08
5. కడప 96 40 -
6. కృష్ణా 316 123 11
7. కర్నూలు 540 168 12
8. నెల్లూరు 96 59 03
9. ప్రకాశం 61 52 -
10. శ్రీకాకుళం 05 00 -
11. విశాఖపట్నం 39 21 -
12. విజయనగరం 03 03 -
13. ప.గోదావరి 59 33 -
14. ఇతరులు 27 - -
మొత్తం 1,833 780 38

గడిచిన 24 గంటల్లో మరో 58 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 1,833కి చేరింది. మొత్తం పాటిజివ్ కేసులకుగానూ చికిత్స అనంతరం కోలుకుని 780 మంది డిశ్ఛార్జ్ కాగా, ఏపీలో కరోనా బారిన పడి ఇప్పటివరకూ 38 మంది మరణించారు.


--------------------------------------------


ఏపీలో మే 6 నాటికి కరోనా వివరాలిలా..   
గడిచిన 24 గంటల్లో మరో 60 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 1,777కి చేరింది. మొత్తం పాటిజివ్ కేసులకుగానూ చికిత్స అనంతరం కోలుకుని 729 మంది డిశ్ఛార్జ్ కాగా, ఏపీలో కరోనా బారిన పడి ఇప్పటివరకూ 36 మంది మరణించారు.


జిల్లాలు  కేసులు డిశ్ఛార్జ్ మృతి
1. అనంతపురం 80 34 04
2. చిత్తూరు 82 68 -
3. తూ.గోదావరి 46 26 -
4. గుంటూరు 363 129 08
5. కడప 90 40 -
6. కృష్ణా 300 117 10
7. కర్నూలు 533 153 11
8. నెల్లూరు 92 56 03
9. ప్రకాశం 61 52 -
10. శ్రీకాకుళం 05 00 -
11. విశాఖపట్నం 39 21 -
12. విజయనగరం - - -
13. ప.గోదావరి 59 33 -
14. ఇతరులు 27 - -
మొత్తం 1,777 729 36

---------------------


ఏపీలో మే 5 నాటికి కరోనా వివరాలిలా ఉన్నాయి..   
గడిచిన 24 గంటల్లో మరో 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 1,717కి చేరింది. మొత్తం పాటిజివ్ కేసులకుగానూ చికిత్స అనంతరం కోలుకుని 589 మంది డిశ్ఛార్జ్ కాగా, ఏపీలో కరోనా బారిన పడి ఇప్పటివరకూ 34 మంది మరణించారు.


జిల్లాలు  కేసులు డిశ్ఛార్జ్ మృతి
1. అనంతపురం 80 24 04
2. చిత్తూరు 82 48 -
3. తూ.గోదావరి 45 22 -
4. గుంటూరు 351 128 08
5. కడప 89 39 -
6. కృష్ణా 286 56 09
7. కర్నూలు 516 114 10
8. నెల్లూరు 92 56 03
9. ప్రకాశం 61 50 -
10. శ్రీకాకుళం 05 00 -
11. విశాఖపట్నం 37 21 -
12. విజయనగరం - - -
13. ప.గోదావరి 59 31 -
14. ఇతరులు 14 - -
మొత్తం 1,717 589 34

---------------------


ఏపీలో మే 4 నాటికి పూర్తి వివరాలిలా ఉన్నాయి..   
గడిచిన 24 గంటల్లో మరో 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 1650కి చేరింది. మొత్తం పాటిజివ్ కేసులకుగానూ చికిత్స అనంతరం కోలుకుని 524 మంది డిశ్ఛార్జ్ కాగా, ఏపీలో కరోనా బారిన పడి ఇప్పటివరకూ 33 మంది మరణించారు.


జిల్లాలు  కేసులు డిశ్ఛార్జ్ మృతి
1. అనంతపురం 78 24 04
2. చిత్తూరు 82 45 -
3. తూ.గోదావరి 45 22 -
4. గుంటూరు 338 115 08
5. కడప 87 37 -
6. కృష్ణా 278 46 08
7. కర్నూలు 491 86 10
8. నెల్లూరు 91 50 03
9. ప్రకాశం 61 50 -
10. శ్రీకాకుళం 05 00 -
11. విశాఖపట్నం 35 20 -
12. విజయనగరం - - -
13. ప.గోదావరి 59 29 -
మొత్తం 1,650 524 33

ప్రస్తుతం 1093 మంది కరోనా వ్యాధికి చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో మొత్తం 10,292 శాంపిల్స్‌ని పరీక్షించగా 67 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. ఈ వివరాలను ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది.


-------------------------------------------------------------------------------


ఏపీలో మే 3 నాటికి పూర్తి వివరాలిలా ఉన్నాయి..   
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో జరిపిన కోవిడ్19 టెస్టుల్లో 58 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,583కు చేరుకుంది. చికిత్స అనంతరం కోలుకుని ఇప్పటివరకూ 488 మంది డిశ్ఛార్జ్ కాగా, 33 మంది మరణించారు. ప్రస్తుతం 1062 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.


జిల్లాలు  కేసులు డిశ్ఛార్జ్ మృతి
1. అనంతపురం 78 24 04
2. చిత్తూరు 81 37 -
3. తూ.గోదావరి 45 20 -
4. గుంటూరు 319 115 08
5. కడప 83 37 -
6. కృష్ణా 266 46 08
7. కర్నూలు 466 77 10
8. నెల్లూరు 91 44 03
9. ప్రకాశం 61 42 -
10. శ్రీకాకుళం 05 00 -
11. విశాఖపట్నం 29 20 -
12. విజయనగరం - - -
13. ప.గోదావరి 59 26 -
మొత్తం 1,583 488 33

కర్నూలు జిల్లాలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. ఆ జిల్లాలో 450కి పైగా కేసులు నమోదు కావడం గమనార్హం. కర్నూలు జిల్లాలో ఏకంగా 466 కేసులు నమోదుయ్యాయి. గుంటూరు జిల్లాలో 319 కరోనా కేసులు, కృష్ణా జిల్లా 266 కేసులతో కరోనా తీవ్రతను ఎదుర్కొంటున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 30 పాజిటివ్ కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 11, కృష్ణా జిల్లాలో 8, అనంతపురం జిల్లాలో 7, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఒక్క కేసు చొప్పున నమోదయ్యాయి.  బికినీలో బ్యూటీలు.. సమ్మర్ మరింత హాట్!


--------------------------------


ఏపీలో మే 1 నాటికి పూర్తి వివరాలిలా ఉన్నాయి..   
రాష్ట్రంలో గత 24 గంటల్లో 7902 శాంపిల్స్ పరీక్షించగా 60 మంది కోవిడ్19 పాజిటివ్‌గా నిర్దారించారు. తాజాగా ఇద్దరు వ్యక్తులు కరోనా కాటుకు బలయ్యారు. దీంతో ఏపీలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు 1463కు చేరాయి. మొత్తం పాజిటివ్ కేసులకుగాను చికిత్స అనంతరం 403 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, 33 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1027.​


జిల్లాలు  కేసులు డిశ్ఛార్జ్ మృతి
1. అనంతపురం 67 22 04
2. చిత్తూరు 80 22 -
3. తూ.గోదావరి 42 17 -
4. గుంటూరు 306 97 08
5. కడప 79 37 -
6. కృష్ణా 246 37 08
7. కర్నూలు 411 66 10
8. నెల్లూరు 84 43 03
9. ప్రకాశం 60 23 -
10. శ్రీకాకుళం 05 00 -
11. విశాఖపట్నం 25 20 -
12. విజయనగరం - - -
13. ప.గోదావరి 58 19 -
మొత్తం 1,463 403 33

---------------------------------------


ఏపీలో ఏప్రిల్ 29 నాటికి పూర్తి వివరాలిలా ఉన్నాయి..      
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దక్షిణ కొరియా నుంచి తెప్పించిన కోవిడ్19 ర్యాపిడ్ కిట్లతో పరీక్షలు చేస్తోంది. దీంతో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు ఏపీలో పెరిగిపోతున్నాయి. తాజాగా 71 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలోని కరోనా కేసుల సంఖ్య 1,403గా ఉంది. చికిత్స అనంతరం ఇప్పటివరకూ 321 మంది కోలుకుని డిశ్భార్జ్ కాగా, 31 మంది కరోనా కాటుకు బలయ్యారు.


జిల్లాలు  కేసులు డిశ్ఛార్జ్ మృతి
1. అనంతపురం 61 20 04
2. చిత్తూరు 80 16 -
3. తూ.గోదావరి 42 14 -
4. గుంటూరు 287 87 08
5. కడప 73 28 -
6. కృష్ణా 246 32 08
7. కర్నూలు 386 43 09
8. నెల్లూరు 84 27 02
9. ప్రకాశం 60 23 -
10. శ్రీకాకుళం 05 00 -
11. విశాఖపట్నం 23 19 -
12. విజయనగరం - - -
13. ప.గోదావరి 56 11 -
మొత్తం 1,403 321 31

-----------------------------------------------


ఏపీలో ఏప్రిల్ 29 నాటికి పూర్తి వివరాలిలా ఉన్నాయి..     
రాష్ట్రంలో గత 24 గంటల్లో 7727 శాంపిల్స్‌ని సేకరించి పరీక్షించగా 73 మందికి కోవిడ్19 పాజిటివ్ తేలింది. ఏపీలో నమోదైన మొత్తం 1332 పాజిటివ్ కేసులకుగాను 287 మంది చికిత్స తర్వాత డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకూ 31 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1014. ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ఈ వివరాలను వెల్లడించింది. ఈ మేరకు బుధవారం ఉదయం ఏపీ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 


జిల్లాలు  కేసులు డిశ్ఛార్జ్ మృతి
1. అనంతపురం 58 17 04
2. చిత్తూరు 77 16 -
3. తూ.గోదావరి 40 12 -
4. గుంటూరు 283 59 08
5. కడప 69 28 -
6. కృష్ణా 236 32 08
7. కర్నూలు 343 43 09
8. నెల్లూరు 82 27 02
9. ప్రకాశం 60 23 -
10. శ్రీకాకుళం 05 00 -
11. విశాఖపట్నం 23 19 -
12. విజయనగరం - - -
13. ప.గోదావరి 56 11 -
మొత్తం 1,332 287 31

------------------------------------------------------


ఏపీలో ఏప్రిల్ 28 నాటికి పూర్తి వివరాలిలా ఉన్నాయి..     
ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 82 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నమోదైన మొత్తం 1,259 పాజిటివ్ కేసులకుగాను చికిత్స అనంతరం కరోనా నుంచి కోలుకుని 258 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ఇప్పటివరకూ కరోనా సోకడంతో 31 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 970 అని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాక తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 


జిల్లాలు  కేసులు డిశ్ఛార్జ్ మృతి
1. అనంతపురం 54 14 04
2. చిత్తూరు 74 16 -
3. తూ.గోదావరి 39 12 -
4. గుంటూరు 254 39 08
5. కడప 65 28 -
6. కృష్ణా 223 29 08
7. కర్నూలు 332 43 09
8. నెల్లూరు 82 24 02
9. ప్రకాశం 56 23 -
10. శ్రీకాకుళం 04 00 -
11. విశాఖపట్నం 22 19 -
12. విజయనగరం - - -
13. ప.గోదావరి 54 11 -
మొత్తం 1,259 258 31

------------------------------------------


ఏపీలో ఏప్రిల్ 27 నాటికి పూర్తి వివరాలిలా ఉన్నాయి..     
ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 80 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నమోదైన మొత్తం 1177 పాజిటివ్ కేసులకుగాను చికిత్స అనంతరం కరోనా నుంచి కోలుకుని 235 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ఇప్పటివరకూ కరోనా సోకడంతో 31 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 911 అని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాక తెలిపింది. ఈ మేరకు సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 


జిల్లాలు  కేసులు డిశ్ఛార్జ్ మృతి
1. అనంతపురం 53 14 04
2. చిత్తూరు 73 16 -
3. తూ.గోదావరి 39 12 -
4. గుంటూరు 237 29 08
5. కడప 58 28 -
6. కృష్ణా 210 29 08
7. కర్నూలు 292 31 09
8. నెల్లూరు 79 23 02
9. ప్రకాశం 56 23 -
10. శ్రీకాకుళం 04 00 -
11. విశాఖపట్నం 22 19 -
12. విజయనగరం - - -
13. ప.గోదావరి 54 11 -
మొత్తం 1,177 235 31

-----------------------------------------------------------------------------


ఏపీలో ఏప్రిల్ 26 నాటికి పూర్తి వివరాలిలా ఉన్నాయి..


ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతునే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో నిర్వహించిన కోవిడ్19 టెస్టుల్లో ఏపీలో కొత్తగా 81 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1097కు పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 31 మంది మరణించగా, కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 231కి చేరుకుంది.


జిల్లాలు  కేసులు డిశ్ఛార్జ్ మృతి
1. అనంతపురం 53 14 04
2. చిత్తూరు 73 13 -
3. తూ.గోదావరి 39 12 -
4. గుంటూరు 214 29 08
5. కడప 58 28 -
6. కృష్ణా 177 29 08
7. కర్నూలు 279 31 09
8. నెల్లూరు 72 23 02
9. ప్రకాశం 56 23 -
10. శ్రీకాకుళం 03 00 -
11. విశాఖపట్నం 22 19 -
12. విజయనగరం - - -
13. ప.గోదావరి 51 10 -
మొత్తం 1097 231 31

-------------------------------------------------------


ఏపీలో ఏప్రిల్ 24 నాటికి పూర్తి వివరాలిలా ఉన్నాయి..


ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతునే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో నిర్వహించిన కోవిడ్19 టెస్టుల్లో ఏపీలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 955 కు పెరిగింది. జిల్లాలవారీగా చూస్తే కర్నూలు 27, కృష్ణా 14, గుంటూరు 11, అనంతపురం 4, ప్రకాశం 3 తూర్పుగోదావరి 2, నెల్లూరు జిల్లాల్లో 1 కేసు నమోదయ్యాయి.


జిల్లాలు  కేసులు డిశ్ఛార్జ్ మృతి
1. అనంతపురం 46 11 04
2. చిత్తూరు 73 11 -
3. తూ.గోదావరి 34 08 -
4. గుంటూరు 206 23 08
5. కడప 51 28 -
6. కృష్ణా 102 25 07
7. కర్నూలు 261 04 08
8. నెల్లూరు 66 06 02
9. ప్రకాశం 53 01 -
10. శ్రీకాకుళం - - -
11. విశాఖపట్నం 22 19 -
12. విజయనగరం - - -
13. ప.గోదావరి 39 09 -
మొత్తం 955 145 29

--------------------------------------------------


ఏపీలో కరోనావైరస్ వ్యాప్తికి సంబంధించి ఏప్రిల్ 23 నాటికి పూర్తి వివరాలిలా ఉన్నాయి..
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో నిర్వహించిన టెస్టుల్లో తాజాగా 80 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనా మహమ్మారి కారణంగా ముగ్గురు వ్యక్తులు మరణించారు. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 893కి చేరుకోగా, 27 మంది మరణించారు. ప్రస్తుతం 725 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.


జిల్లాలు  కేసులు డిశ్ఛార్జ్ మృతి
1. అనంతపురం 42 07 03
2. చిత్తూరు 73 11 -
3. తూ.గోదావరి 32 08 -
4. గుంటూరు 195 23 08
5. కడప 51 28 -
6. కృష్ణా 88 25 07
7. కర్నూలు 234 04 07
8. నెల్లూరు 67 06 02
9. ప్రకాశం 50 01 -
10. శ్రీకాకుళం - - -
11. విశాఖపట్నం 22 19 -
12. విజయనగరం - - -
13. ప.గోదావరి 39 09 -
మొత్తం 893 141 27

--------------------------------------------------------------------------------------------


ఏపీలో కరోనావైరస్ వ్యాప్తికి సంబంధించి ఏప్రిల్ 22 నాటికి పూర్తి వివరాలిలా ఉన్నాయి..


ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 56 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 813కి చేరుకున్నాయి. తాజాగా మరో ఇద్దరు కరోనా బారిన పడి చనిపనోయారు. చికిత్స అనంతరం ఇప్పటివరకు 120 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకూ మొత్తం 24 మంది మరణించారు. 


జిల్లాలు  కేసులు డిశ్ఛార్జ్ మృతి
1. అనంతపురం 36 07 03
2. చిత్తూరు 59 04 -
3. తూ.గోదావరి 26 08 -
4. గుంటూరు 177 23 08
5. కడప 51 23 -
6. కృష్ణా 86 16 06
7. కర్నూలు 203 04 05
8. నెల్లూరు 67 06 02
9. ప్రకాశం 48 01 -
10. శ్రీకాకుళం - - -
11. విశాఖపట్నం 21 19 -
12. విజయనగరం - - -
13. ప.గోదావరి 39 09 -
మొత్తం 813 120 24

రాష్ట్రంలో ప్రస్తుతం 669 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా మరణాలు రెండు గుంటూరు జిల్లాలోనే సంభవించాయి. గడిచిన 24 గంటల్లో 24 మంది కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. జిల్లాలవారీగా చూస్తే గుంటూరులో 8, కృష్ణాలో 2, కడపలో 4, నెల్లూరులో 4, అనంతపురం 5, విశాఖపట్నం నుంచి ఒక్కరు చొప్పున కరోనా పాజిటివ్ డిశ్ఛార్జ్ అయ్యారు.


--------------------------------------------------------------------------


ఏపీలో కరోనావైరస్ వ్యాప్తికి సంబంధించి ఏప్రిల్ 21 నాటికి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. 
ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 35 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నమోదైన మొత్తం 757 పాజిటివ్ కేసులకుగాను చికిత్స అనంతరం 96 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకూ 22 మంది మరణించారు. ప్రస్తుతం 639 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాలవారీగా చూస్తే కర్నూలులో 10, గుంటూరులో 9 కృష్ణాలో 3 కడపలో 6 పశ్చిమ గోదావరిలో 4, అనంతపురంలో 3 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.


జిల్లాలు  కేసులు డిశ్ఛార్జ్ మృతి
1. అనంతపురం 36 02 03
2. చిత్తూరు 53 04 -
3. తూ.గోదావరి 26 08 -
4. గుంటూరు 158 15 06
5. కడప 46 19 -
6. కృష్ణా 83 14 06
7. కర్నూలు 184 04 05
8. నెల్లూరు 67 02 02
9. ప్రకాశం 44 01 -
10. శ్రీకాకుళం - - -
11. విశాఖపట్నం 21 18 -
12. విజయనగరం - - -
13. ప.గోదావరి 39 09 -
మొత్తం 757 96 22

--------------------------------------------------------------------------------------------------------------------------


ఏపీలో కరోనావైరస్ వ్యాప్తికి సంబంధించి ఏప్రిల్ 20 నాటికి పూర్తి వివరాలిలా ఉన్నాయి. .
రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 75 కేసులు పాజిటివ్‌గా నమోదయ్యాయి. రాష్ట్రంలో నమోదైన మొత్తం 722 పాజిటివ్ కేసులకుగాను 92 మంది డిశ్చార్జ్ కాగా, 20 మంది మరణించారు. తాజాగా మూడు మరణాలు సంభవించాయి. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 610. ఈ యాక్టివ్ కేసులకు అన్ని జిల్లాల్లోనూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆస్పత్రులలో చికిత్స అందిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల దక్షిణ కొరియా నుంచి తెప్పించిన లక్ష కిట్లతో కోవిడ్19 టెస్టులను వేగవంతం చేసింది #APFightsCorona


జిల్లాలు  కేసులు డిశ్ఛార్జ్ మృతి
1. అనంతపురం 33 02 03
2. చిత్తూరు 53 04 -
3. తూ.గోదావరి 26 08 -
4. గుంటూరు 149 15 04
5. కడప 40 19 -
6. కృష్ణా 80 14 06
7. కర్నూలు 174 01 05
8. నెల్లూరు 67 01 02
9. ప్రకాశం 44 01 -
10. శ్రీకాకుళం - - -
11. విశాఖపట్నం 21 18 -
12. విజయనగరం - - -
13. ప.గోదావరి 35 09 -
మొత్తం 722 92 20

రాష్ట్రంలో ఇప్పటివరకూ రెండు జిల్లాల్లో 100కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 174 కేసులతో కర్నూలు, 149 కేసులతో గుంటూరు జిల్లాలు కరోనా తీవ్రతను ఎదుర్కొంటున్నాయి. కాగా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటివరకూ ఒక్క కరోనా కేసు కూడా నమోదు అవకపోవడం గమనార్హం.


----------------------------------------------------------------------


ఏపీలో కరోనావైరస్ వ్యాప్తికి సంబంధించి ఏప్రిల్ 19న నాటి పూర్తి వివరాలిలా ఉన్నాయి.


గడచిన 24  గంటల్లో ఏపీలో కొత్తగా 44 కరోనా పాజిటివ్ కేసులు  నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రజల్లో భయాందోళన  పెరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 647 కేసులు  నమోదయ్యాయి. అందులో 65 మంది చికిత్స తీసుకుని క్షేమంగా ఇంటికి వెళ్లారు. కరోనా మహమ్మారికి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో 17 మంది బలయ్యారు. ప్రస్తుతం పలు ఆస్పత్రుల్లోనే ప్రత్యేక ఐసోలేషన్ వార్డులలో 565 మంది కరోనా వైరస్ తో పోరాడుతున్నారు.


జిల్లాలు  కేసులు డిశ్ఛార్జ్ మృతి
1. అనంతపురం 29 02 02
2. చిత్తూరు 28 04 -
3. తూ.గోదావరి 24 08 -
4. గుంటూరు 129 - 04
5. కడప 37 19 -
6. కృష్ణా 75 04 05
7. కర్నూలు 158 01 04
8. నెల్లూరు 67 01 02
9. ప్రకాశం 44 01 -
10. శ్రీకాకుళం - - -
11. విశాఖపట్నం 21 16 -
12. విజయనగరం - - -
13. ప.గోదావరి 35 09 -
మొత్తం 647 65 17

జిల్లాలవారీగా చూస్తే అత్యధికంగా కృష్ణా జిల్లాలో 5 మంది చనిపోయారు. గుంటూరు, కర్నూలు జిల్లాల్లో నలుగురు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటివరకూ కరోనా కేసు నమోదు అవకపోవడం గమనార్హం.


-------------------------------------------------------------------------------------------------------------------


ఏపీలో కరోనావైరస్ వ్యాప్తికి సంబంధించి ఏప్రిల్ 15న నాటి పూర్తి వివరాలిలా ఉన్నాయి.


అమరావతి: ఏపీలో ఏప్రిల్ 15న బుధవారం కొత్త‌గా మ‌రో 23 కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గుర్తించినట్టు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు ఏపీలో మొత్తం క‌రోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 525కు చేరింది. బుధవారం రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు చనిపోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య మొత్తం 14కు చేరింది. మరోవైపు న‌లుగురు కరోనావైరస్ రోగులు వ్యాధి నయమవడంతో బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వీరితో కలిపి ఏప్రిల్ 15వ తేదీ వ‌ర‌కు 20 మంది క‌రోనావైరస్ నుంచి కోల‌ుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోవిడ్ ఆస్పత్రులలో 491 మంది కరోనావైరస్ పాజిటివ్‌తో చికిత్స పొందుతున్నారు. 


Also read: Telangana updates: తెలంగాణలో 650కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు


ఏపీలో ఇప్పటివరకు 11,613 మంది అనుమానితుల శాంపిల్స్‌ని పరీక్షించగా.. 11,088 మందికి కరోనా నెగటివ్ అని నిర్ధారణ అయింది. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 1401 మందికి పరీక్ష జరపగా, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 242 మందికి మాత్రమే కరోనా పరీక్షలు జరిపారు. 


Also read : Tablighi Jamaat Markaz: తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్‌పై హత్య కేసు


ఏపీలో జిల్లాల వారీగా ఏయే జిల్లాలో అత్యధికంగా కరోనావైరస్ పాజిటివ్ కేసుల నమోదయ్యాయనే విషయానికొస్తే... గుంటూరు జిల్లాలో అత్య‌ధికంగా 122 మంది, కర్నూలు జిల్లాలో 110 మంది, నెల్లూరు జిల్లాలో 58 మంది, కృష్ణా జిల్లాలో 45 మంది, ప్రకాశం జిల్లాలో 42 మంది, క‌డ‌ప జిల్లాలో 36 మంది, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో 31 మంది, చిత్తూరు జిల్లాలో 23 మంది, అనంత‌పురంలో 21, విశాఖ‌లో 20, తూర్పు గోదావ‌రిలో 17 మంది ఉన్నారు. అదృష్టవశాత్తుగా విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాల నుంచి ఒక్క కరోనావైరస్ పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. దీంతో ఆ రెండు జిల్లాల విషయంలో సర్కార్‌కి, అక్కడి అధికారులకు కొంత ఉపశమనాన్ని కలిగించింది. అయితే, ఆ రెండు జిల్లాల్లోనూ కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలను సర్కార్ తీసుకుంటోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


                           *******************************


జిల్లాలు  కేసులు డిశ్ఛార్జ్ మృతి
1. అనంతపురం 15 - 02
2. చిత్తూరు 23 01 -
3. తూ.గోదావరి 17 01 -
4. గుంటూరు 90 - 02
5. కడప 31 - -
6. కృష్ణా 36 04 02
7. కర్నూలు 84 - -
8. నెల్లూరు 52 01 01
9. ప్రకాశం 41 01 00
10. శ్రీకాకుళం - - -
11. విశాఖపట్నం 20 04 -
12. విజయనగరం - - -
13. ప.గోదావరి 23 - -
మొత్తం 432 12 07

 


శుభవార్త.. గత 12 గంటల్లో కరోనా కేసుల్లేవ్


ఏపీలో కరోనా సమగ్ర సమాచారం
  జిల్లాలు కరోనా కేసులు కోలుకున్నవారు మృతి
1 అనంతపురం 13 - 01
2 చిత్తూరు 20 - -
3 తూర్పు గోదావరి 11 01 -
4 గుంటూరు 49 - -
5 కడప 28 - -
6 కృష్ణా 35 02 02
7 కర్నూలు 75 - 01
8 నెల్లూరు 48 01 -
9 ప్రకాశం 27 01 -
10 శ్రీకాకుళం - - -
11 విశాఖపట్నం 20 04 -
12 విజయనగరం   - -
13 పశ్చిమ గోదావరి 22 - -
  మొత్తం 348 09 04

కాగా, కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోవిడ్ వాలంటీర్ల నియామకానికి మొగ్గుచూపారు. మెడికల్ విద్యార్థులు, మెడికల్ సంబంధిత వ్యక్తులు ఎవరైనా స్వచ్ఛందంగా కోవిడ్ వాలంటీర్లుగా చేరవచ్చునని అధికారులు తెలిపారు. వాలంటీర్లుగా నమోదు చేసుకునేందుకు ఏపీ సర్కార్ ఓ వెబ్ సైట్ ప్రారంభించింది. https://health.ap.gov.in/CVPASSAPP/Covid/VolunteerJobs ఈ వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. 


ఏప్రిల్ 9న రాత్రి ఏపీ సర్కార్ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం లేటెస్ట్ అప్‌డేట్స్


అమరావతి: ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల తీవ్రతలో కొంత మార్పు కనిపిస్తోంది. ఏపీలో బుధవారం 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా గురువారం 15 పాజిటివ్‌ కేసులు రావడం కొంత ఉపశమనాన్నిస్తోంది. మొదట్లో భారీగా నమోదైన పాజిటివ్ కేసులు గత రెండు రోజుల నుంచి స్వల్పంగా తగ్గుతుండటాన్ని పరిశీలిస్తే.. పరిస్థితిలో మార్పు కనిపిస్తున్నట్టే అనిపిస్తోంది అని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ గురువారం రాత్రి విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌ ప్రకారం నేడు నమోదైన 15 కోవిడ్ పాజిటివ్ కేసులు కలిపి ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 363కు చేరింది. గురువారం ప్రకాశం జిల్లాలో 11, గుంటూరు జిల్లాలో 2, తూర్పు గోదావరి, కడప జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. 


25 దేశాలకు హైడ్రోక్లోరోకిన్ ఎగుమతికి ప్రధాని మోదీ గ్రీన్ సిగ్నల్


[[{"fid":"184164","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఏపీలో ఇప్పటివరకు 10 మంది కరోనావైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. గురువారం అనంతపురం జిల్లా మనురేవుకి చెందిన 70 ఏళ్ల వృద్ధుడు, గుంటూరులోని ఎన్ఆర్ పేటకు చెందిన 45 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. దీంతో ఏపీలో కరోనా మృతుల సంఖ్య ఆరుకు చేరుకుంది.


ఏపీలో కరోనా వాలంటీర్ పోస్టులు.. ముందుకొస్తే ఓ ఆఫర్!


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos


 Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ


బుల్లితెర భామ టాప్ Bikini Photo