Telangana updates: తెలంగాణలో 650కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 650కి చేరింది. తెలంగాణలో బుధవారం కొత్తగా నమోదైన 6 కరోనా పాజిటివ్‌ కేసులతో కలిపి  మొత్తం కేసుల సంఖ్య 650కి చేరిందని వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Last Updated : Apr 16, 2020, 12:30 AM IST
Telangana updates: తెలంగాణలో 650కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 650కి చేరింది. తెలంగాణలో బుధవారం కొత్తగా నమోదైన 6 కరోనా పాజిటివ్‌ కేసులతో కలిపి  మొత్తం కేసుల సంఖ్య 650కి చేరిందని వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. బుధవారం నాడు 8 మంది డిశ్చార్జ్‌ అవడంతో ఇప్పటివరకు 118 మంది కోవిడ్ బారి నుంచి నయమై ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్టయింది. ఇప్పటివరకు 18 మంది మృతి చెందారు. ఇవే కాకుండా రాష్ట్రంలో ప్రస్తుతం 514 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టంచేసింది. ఇదిలావుంటే, కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, వైరస్ సోకిన వారికి అందుతున్న వైద్య సహాయం, లాక్ డౌన్ అమలు, పేదలకు అందుతున్న సాయం, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 

Also read : Tablighi Jamaat Markaz: తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్‌పై హత్య కేసు

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. లాక్‌డౌన్ అమలుకు ప్రజలు ఎంతో సహకరిస్తున్నారని.. రానున్న రోజుల్లో కూడా ఇలాగే సహకరించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. కరోనా వైరస్‌పై యుద్ధంలో భాగంగా ఎంత మందికైనా కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహించడానికి, వైరస్ సోకిన వారికి చికిత్స అందించడానికి తెలంగాణ సర్కార్ సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టంచేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News