AP Election Notification: దేశంలో తొలి విడత ఎన్నికలు రేపు ఏప్రిల్ 19న జరగనున్నాయి. మరోవైపు ఏపీ ఎన్నికలకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ఇవాళ విడుదల కానుంది. ఇందులో భాగంగా ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు నియోజకవర్గ కేంద్రాల్లో నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇవాళ నోటిఫికేషన్ వెలువడగానే నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమౌతుంది. ఏప్రిల్ 25 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 26వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఏప్రిల్ 29వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా ఉంది. మే 13వ తేదీ పోలింగ్ జరగనుండగా జూన్ 4న కౌంటింగ్ ఉంటుంది. 


నామినేషన్ దాఖలు చేసే అభ్యర్ధులు 13 రకాల డాక్యుమెంట్లు తీసుకురావల్సి ఉంటుంది. లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్ధులు ఫారమ్ 2ఏ, అసెంబ్లీకు పోటీ చేసే అభ్యర్ధులు ఫారమ్ 2బిలో దరఖాస్తు చేయాలి. ఉదయం 11 గంటల్నించి మద్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్లు స్వీకరిస్తారు. సెలవు రోజుల్లో నామినేషన్లు స్వీకరణ ఉండదు. అభ్యర్ధులు గరిష్టంగా 4 సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అభ్యర్ధి నామినేషన్‌ను నేరుగా లేదా ప్రపోజర్ ద్వారా సమర్ధించవచ్చు. ఒక్కో అభ్యర్ధి గరిష్టంగా 2 నియోజకవర్గాల్లోనే పోటీ చేయాల్సి ఉంటుంది. అభ్యర్ధితో పాటు కేవలం ఐదుగురికి మాత్రమే ఆఫీసులో ప్రవేశం ఉంటుంది. 


నామినేషన్‌తో పాటు ఫారమ్ 26 సమర్పించాల్సి ఉంటుంది. నామినేషన్ దాఖలు చేసినప్పట్నించి ఖర్చు లెక్కింపు ఉంటుంది. వివిధ వార్తాపత్రికల్లో వచ్చే పెయిడ్ న్యూస్ ప్రకటనలు కూడా అభ్యర్ధి ఖాతాలోనే లెక్కిస్తారు. అసెంబ్లీకు పోటీ చేసే అభ్యర్ధులు 10 వేల డిపాజిట్, లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్ధులు 25 వేల డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సి, ఎస్టి అభ్యర్ధులైతే 50 శాతం చెల్లిస్తే సరిపోతుంది. 


Also read: Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook