AP Election 2024 Results: ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు కన్పిస్తున్నాయి. తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. కూటమి పార్టీల్లో గెలుపు సంబరాలు కన్పిస్తున్నాయి. జనసేన అయితే 19 నియోజకవర్గాల్లో స్పష్టమైన ఆధిక్యం దిశగా సాగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా వెనుకబడింది. వైనాట్ 175 నినాదంతో రెండోసారి అధికారం చేజిక్కించుకుందామనుకున్న ఆశలు నీరుగారిపోయాయి. కూటమి అభ్యర్ధులు స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకుపోతున్నారు. తెలుగుదేశం పార్టీ 133 స్థానాల్లో ఆదిక్యంలో ఉంటే జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేయగా 20 స్థానాల్లో ఆదిక్యంలో ఉంది. ఇక బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేయగా 7 స్థానాల్లో ముందంజలో ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఘోరంగా వెనుకబడింది. గత ఎన్నికల్లో 151 సీట్లలో విజయం సాధించిన పార్టీ ఈసారి కేవలం 15-17 స్థానాల్లోనే ఆధిక్యం కనబరుస్తోంది. 


గత ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు చోట్లా ఓడిపోగా కేవలం రాజోలు ఒక్క స్థానంలోనే ఆ పార్టీ విజయం సాధించింది. ఇక ఈసారి మాత్రం కూటమిలో భాగంగా 21 స్థానాల్లో పోటీ చేసి ఏకంగా 20 స్థానాల్లో విజయం దిశగా దూసుకుపోతోంది. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం పిఠాపురంలో భారీ ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు. మొత్తానికి ఈ ఎన్నికల్లో జనసేన పడిలేచిన కెరటంగా కన్పిస్తోంది. 


Also read: Vijayawada Lok Sabha Election Result: విజయవాడలో విజయం ఎవరిది అన్నదా తమ్ముడిదా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook