Janasena strategy: గత ఎన్నికల సమయంలో డబ్బులతో రాజకీయాలు చేయమంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చిన జనసేనాని అన్నింటినీ తుంగలో తొక్కేసినట్టు కన్పిస్తోంది. ఇప్పుడు డబ్బులుంటేనే రాజకీయాలంటోంది. డబ్బులు సిద్ధం చేసుకునే సీట్లు అడగమని నేతలకు సూచిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరి కొద్దిరోజుల్లో ఏపీ అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఇవాళ తెలుగుదేశం-జనసేన కూటమిగా మొదటి జాబితా విడుదలయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు మొన్నటివరకూ రాజకీయాల్లో విలువల గురించి పదే పదే ప్రస్తావించిన జనసేనాని ఇప్పుడు ఆ మాటలకు చెక్ చెప్పేశారు. డబ్బులతో జనసేన పార్టీ రాజకీయాలు చేయదని గత ఎన్నికల్లో పదే పదే చెప్పిన పవన్  కళ్యాణ్ ఇప్పుడు డబ్బులతోనే రాజకీయాలు చేసేందుకు నిర్ణయించుకుంది. ఇటీవల బహిరంగంగా కూడా ఈ దిశగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఓట్ల కోసం డబ్బులు తీయకతప్పదని చెప్పారు. గత ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క సీటు గెల్చుకున్న పార్టీ ఈసారి తెలుగుదేశం పొత్తుతో ఎక్కువ సీట్లు గెల్చుకోవాలని చూస్తోంది. 


ఈసారి ఎన్నికల్లో ఆర్ధికంగా పటిష్టంగా ఉన్నవారికే సీట్లు ఇచ్చేందుకు పార్టీ ఆసక్తి కనబరుస్తోంది. ఉద్యమకారుల లేదా సామాజికవేత్తలు లేదా మేధావులకు సీట్లిచ్చి డబ్బులు ఖర్చు చేయలేకపోతే నిరుపయోగమని భావించింది. అందుకే ఈసారి సీట్లు ఆశిస్తున్న నేతలు నగదు సిద్ధం చేసుకోవాలనే సందేశాన్ని పంపిస్తోంది. అందుకే ఎవరైనా ఫలానా నియోజకవర్గం సీటు ఆశిస్తుంటే..ఎంత ఖర్చు చేయగలరని అడుగుతోంది. నియోజకవర్గాన్ని బట్టి ఖర్చుకు సిద్ధంగా ఉండాలని చెబుతోంది. 


ఇప్పటికే కార్యకర్తలు, నేతల్నించి జనసేన చందాలు స్వీకరిస్తోంది. ఆన్‌లైన్ స్కాన్ కోడ్ ద్వారా గరిష్టంగా పది కోట్ల వరకూ ఇచ్చేలా వెసులుబాటు కల్పించింది. ఇప్పుడు చందాలిచ్చామనే కారణంతో సీట్లు అడగవద్దని చెబుతోంది. అంటే చందాలిచ్చి టికెట్ తమదేనని ప్రచారం చేసుకోవద్దని పరోక్షంగా చెబుతోంది. చందాలు ఇచ్చినా ఇవ్వకున్నా..టికెట్ కావాలంటే మాత్రం భారీగా డబ్బులు సిద్ధం చేసుకోవల్సిందేనని స్పష్టం చేస్తోంది. 


ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులకు పార్టీ నుంచి ఒక్క పైసా కూడా డబ్బులు అందవంటోంది. వారాహి యాత్రల్లో కూడా ఆయా జిల్లాల నేతలే ఖర్చుపెట్టుకున్నారు. ఎన్నికల్లో టికెట్ ఆశించే అభ్యర్ధులు సొంతంగా ఖర్చుపెట్టుకోవల్సి ఉంటుందని పార్టీ చెబుతోంది.


Also read: Green tea vs Black Coffee: గ్రీన్ టీ వర్సెస్ బ్లాక్ కాఫీల్లో ఏది బెటర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook