AP Election Survey: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నోటిఫికేషన్ మరి కొద్దిరోజుల్లో వెలువడనుంది. ఓ వైపు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలో దిగుతుంటే ప్రతిపక్షాలు కూటమిగా సిద్దమౌతున్నాయి. ఈ నేపధ్యంలో ఓటరు నాడి తెలుసుకునేందుకు వివిధ సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికారం ఆ పార్టీదేనని ప్రముఖ సంస్థ తేల్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఎప్పటికప్పుడు సర్వే నిర్వహిస్తున్న టైమ్స్ నౌ సంస్థ మరోసారి ప్రజల నాడి తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే  అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలు, తెలుగుదేశం-జనసేన కూటమిగా 6 స్థానాలు గెల్చుకుంటాయని తెలిపింది. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలో వస్తుందని తేల్చింది. జాతీయ పార్టీలు కాంగ్రెస్ , బీజేపీలు ఒక్క సీటు కూడా గెల్చుకోవని సర్వే వెల్లడించింది. ఇక ఓట్ షేర్ గురించి పరిశీలిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 47 శాతం ఓటింగ్ తెచ్చుకుంటే..తెలుగుదేశం-జనసేనలు 44 శాతం ఓటింగ్ సాధిస్తాయని తెలిపింది. 


ఇక ఏపీలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పనితీరు గురించి ప్రశ్నించినప్పుడు 38 శాతం మంది పాలన అద్భుతంగా ఉందని అభిప్రాయం వ్యక్తపరిచారు. 26 శాతం మంది ఫరవాలేదు బాగుందని చెప్పారు. 34 శాతం మంది అసంతృప్తి వ్యక్తపరిచారు. మరో 2 శాతం మంది చెప్పలేమన్నారు.


2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 22 లోక్‌సభ స్థానాలు గెల్చుకుంటే తెలుగుదేశం పార్టీ 3 సీట్లతో సరిపెట్టుకుంది. 2014లో బీజేపీ-తెలుగుదేశం కూటమిగా ఉన్నాయి. 2019లో విడిపోయాయి. తిరిగి ఇప్పుడు మరోసారి ఎన్డీయేలో చేరేందుకు తెలుగుదేశం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం తెలుగుదేశం-బీజేపీ మధ్య చర్చలు జరుగుతున్నాయి. 


Also read: Chandrababu met Amit Shah: అర్ధరాత్రి ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు భేటీ, ఏం జరిగింది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook