Chandrababu met Amit Shah: అర్ధరాత్రి ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు భేటీ, ఏం జరిగింది

Chandrababu met Amit Shah: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మూడు పార్టీల కూటమికి మార్గం సుగమమౌతోంది. నిన్న అర్ధరాత్రి ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు సమావేశమయ్యారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 8, 2024, 08:07 AM IST
Chandrababu met Amit Shah: అర్ధరాత్రి ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు భేటీ, ఏం జరిగింది

Chandrababu met Amit Shah: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కిపోతోంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైనాట్ 175 లక్ష్యంతో దూకుడుగా వ్యవహరిస్తుంటే ప్రతిపక్షాలు పొత్తుల చర్చలు జరుపుకుంటున్నాయి. తాజాగా బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు భేటీ ముగిసింది. 

ఏపీలో 2014 కూటమి రిపీట్ అయ్యే పరిస్థితి కన్పిస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం-జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు రెండు పార్టీలు బీజేపీని కలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. బీజేపీ నుంచి ఇప్పటి వరకూ ఈ విషయంపై స్పష్టత రాలేదు. నిన్న బుధవారం తెలుగుదేశం అధినేత చంద్రబాబు హఠాత్తుగా బీజేపీ పెద్దల్ని కలుసుకునేందుకు ఢిల్లీ వెళ్లారు. కేంద్ర మంత్రి అమిత్ షా పిలుపు మేరకే వెళ్లారంటూ టీడీపీ వర్గాలు ప్రచారం చేశాయి. అయితే నిన్న రాత్రి 10 గంటల వరకూ చంద్రబాబు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో ఉన్నారు. అమిత్ షా లేదా జేపీ నడ్డాను కలుసుకోలేదు. దాంతో ఏ విధమైన చర్చల్లేకుండానే తిరిగొచ్చేస్తారనే ప్రచారం జరిగింది. చివరికి అర్ధరాత్రి 11.30 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసానికి వెళ్లారు. అప్పటికే ఆయన నివాసంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉన్నారు. 

దాదాపు 40 నిమిషాలు చంద్రబాబు, అమిత్ షా, జేపీ నడ్డాల మధ్య చర్చలు జరిగాయి. ఆ తరువాత చంద్రబాబు బయటికొచ్చేసారు. మరోసారి ఎన్డీఏ కూటమిలో చేరిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సైతం చంద్రబాబు కంటే ముందు అమిత్ షా, జేపీ నడ్డాలతో భేటీ అయ్యారు. కొందరు బీజేపీ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. 

Also read: Yatra 2 Twitter Review: యాత్ర 2 ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది, సినిమా ఎలా ఉందంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News