AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఉదయం 8 గంటల్నించి సాయంత్ర 6 గంటల వరకూ పోలింగ్ ఉంటుంది. ఈ నేపధ్యంలో ఇవాళ్టితో కీలకమైన ప్రచారఘట్టం ముగియనుంది. సాయంత్రం 6 గంటల తరువాత స్థానికేతరులు ఎవరూ నియోజకవర్గాల్లో ఉండకూడదు. చివరిరోజు కావడంతో ప్రచారం పీక్స్‌కు చేరనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇవాళ చివరి రోజున ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ జగన్ మూడు నియోజకవర్గాల్లో భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు పల్నాడు జిల్లా చిలకలూరిపేట సభలో పాల్గొంటారు. అక్కడ్నించి ఏలూరు జిల్లా కైకలూరులో సభ నిర్వహిస్తారు. కైకలూరులో మద్యాహ్నం 12.30 గంటలకు బహిరంగసభ ఉంది. కైకలూరు నుంచి నేరుగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ బస్టాండ్ సెంటర్‌లో సభలో పాల్గొంటారు. మద్యాహ్నం 3 గంటలకు ఉప్పాడ సభలో పాల్గొననున్నారు. ఇవాళ జరిగే మూడు సభల్లో ఉప్పాడ సభ అత్యంత కీలకం కానుంది. జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం కావడంతో జగన్ ఏం మాట్లాడతారనేది ఆసక్తి రేపుతోంది. 


మరోవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇవాళ రెండు సభల్లో పాల్గొననున్నారు. ముందుగా నంద్యాల సభలో పాల్గొంటారు. ఆ తరువాత చిత్తూరులో జరిగే సభకు హాజరవుతారు. చివరిగా తిరుమల వెళ్లి దర్శనం చేసుకోనున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ నిన్న రాత్రే పిఠాపురంలో ప్రసంగించారు. ఇవాళ ఆయన అన్న కొడుకు రామ్‌చరణ్, తల్లి సురేఖతో కలిగి స్థానికంగా ఉన్న కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. 


ఇవాళ సాయంత్రం 6 గంటలతో ప్రచారం ముగియడంతో ఇక మిగిలిన 36 గంటలు అత్యంత కీలకం కానుంది. అసలైన పోల్ మేనేజ్‌మెంట్ ప్రక్రియ జరగనుంది. ఏ పార్టీ పోల్ మేనేజ్‌మెంట్ బాగుంటే ఓట్లు ఆ పార్టీకే దక్కుతాయి. ప్రతి ఓటరును పోలింగ్ బూత్ వరకూ తీసుకెళ్లగలగడంలో పార్టీల సామర్ధ్యం ఆధారపడి ఉంది. 


Also read: AP Weather Forecast: మరో ఐదు రోజులు ఏపీలో వర్షాలు, విజయవాడలో భారీ వర్షం



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook