AP Weather Forecast: మే మొదటి వారం వరకూ తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన ఎండలు ఠారెత్తించాయి. కుండపోత వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మహారాష్ట్రలోని తూర్పు విదర్బ ఇతర ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న4-5 రోజులు ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.
ఏపీలోని పలు జిల్లాల్లో రోజుకో రకంగా వాతావరణం ఉంటుంది. మొన్న మే 8న రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిస్తే 9వ తేదీన కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఠారెత్తించాయి. నిన్న మే 10వ తేదీన కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలో అత్యదికంగా విజయవాడ, అవనిగడ్డ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నిన్న విజయవాడలో గంటకు పైగా కురిసిన భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.. కొన్ని ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. ఇక గుంటూరు, కృష్ణా, ఏలూరు, తూర్పు గోదావరి, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. అవనిగడ్డలో నిన్న శుక్రవారం 7.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
తమిళనాడు, తూర్పు విదర్బ, మహారాష్ట్రలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో రానున్న4-5 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉరుములు మెరుపులు, పిడుగులతో భారీ వర్షాలు పడనున్నాయి. ఇతర జిల్లాల్లో మోస్తరు వర్షాలుంటాయి. ముఖ్యంగా ఆరుబయట, బహిరంగ ప్రదేశాల్లో, చెట్ల కింద సంచరించవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఏపీలో రానున్న 4-5 రోజులు వర్షసూచన ఉందని వాతావరణ శాఖ తెలిపిదంి. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరి కొన్నిప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నాయి. కేరళ మీదుగా కొనసాగుతున్న ఆవర్తనంతో ద్రోణి ఏర్పడవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది.
Also read: Telangana Weather Report: తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఈ నెల 15 వరకూ భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook