AP Elections 2024: ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైనాట్ 175 లక్ష్యంతో బరిలో దిగుతుంటే ప్రతిపక్షాలు కూటమిగా వస్తున్నాయి. పదేళ్ల క్రితం పొత్తుల్ని రిపీట్ చేస్తూ తెలుగుదేశం-జనసేన-బీజేపీ త్రయం ముందుకొస్తోంది. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనతో ఉమ్మడి సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోదీ ఈ సభకు హాజరుకావచ్చని అంచనా.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో సరికొత్త రాజకీయా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలుగుదేశం-జనసేన కూటమిలో బీజేపీ చేరడంతో అధికార పార్టీపై ఒత్తిడి అధికం కానుంది. ఇన్నాళ్లూ రాష్ట్రంలో అన్ని విషయాల్లో తోడుగా నిలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఇప్పుడు ప్రధాని మోదీ లేదా బీజేపీ పెద్దలు ఎన్నికల ప్రచారంలో ఎలాంటి వైఖరి అవలంభిస్తారనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే కేంద్రంలోని బీజేపీ పెద్దలంతా ఇప్పటి వరకూ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయలేదు. ఇప్పుడు వైసీపీకు వ్యతిరేకంగా ఏర్పడిన కూటమిలో బీజేపీ చేరడంతో ఎలాంటి విమర్శలకు సిద్ధమౌతుందో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మార్చ్ 17వ తేదీన పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఏర్పాట్లు చేసిన మూడు పార్టీల ఉమ్మడి సభకు ప్రధాని మోదీ హాజరుకావచ్చని సమాచారం. 


ఈ సభా వేదికగా ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన చేయనున్నారు. ఇప్పటికే తెలుగుదేశం-జనసేన కలిసి మేనిఫెస్టో సిద్ధంచేశాయి. ఇప్పుడు బీజేపీ తరపున చేర్చాల్సిన హామీలు కలపాల్సి ఉంటుంది. చిలకలూరిపేట సభకు ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా ఇతర రాష్ట్ర బీజేపీ నేతలు, ఒకరిద్దరు కేంద్ర మంత్రులు సైతం రావచ్చని అంచనా. మూడు పార్టీల కూటమి ఇదే సభతో ఎన్నికల శంఖారావం పూరించనుంది. 


ఆరేళ్ల తరువాత తిరిగి ఎన్డీయేలో తెలుగుదేశం పార్టీ చేరింది. ఇప్పుడిక ఏపీలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల  బీజేపీ వైఖరి ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. మార్చ్ 17న జరగనున్న సభలో ప్రధాని మోదీ రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలకు సిద్ధం కానున్నారనేది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇప్పటి వరకూ మోదీ వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించింది లేదు. 


Also read: Ap Elections 2024: ఏపీలో 2014 పొత్తులు రిపీట్, ఎవరికెన్ని సీట్లంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook