AP Elections 2024: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిన్నటి వరకూ వైనాట్ 175 టార్గెట్ పెట్టుకోగా ఇవాళ మార్పు వచ్చింది. చిత్తూరు జిల్లా మదనపల్లెలో నిర్వహించిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా ఈసారి ఏపీలో డబుల్ సెంచరీ సాధించడమే లక్ష్యమన్నారు. వైనాట్ 175కు వైనాట్ 25 కలిపారు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో ఈసారి 175 అసెంబ్లీ స్థానాలు 25 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యమని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. పేద ప్రజలకు సంక్షేపథకాల్ని దూరం చేయడమే చంద్రబాబు, జనసేన లక్ష్యమని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. మంచంపై నుంచి కదల్లేని స్థితిలో ఉన్నవారికి ఇంటి వద్దకే పింఛన్లు అందిస్తుంటే చూడలేక ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి అడ్డుకున్నారని మండిపడ్డారు. మరోసారి వైసీపుకు ఓటేస్తే ఇంటింటికీ పింఛన్ల పంపిణీను కొనసాగిస్తామని తెలిపారు. అదే కూటమికి ఓటేస్తే వాలంటీర్ల వ్యవస్థ రద్దుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనన్నారు. ఈ ఎన్నికలు పూర్తిగా పేదలకు, పెత్తందార్లకు మధ్య జరుగుతున్నవేనన్నారు. 


2019లో ఇచ్చిన మేనిఫెస్టోను 99 శాతం అమలు చేశామని వైఎస్ జగన్ చెప్పారు. కానీ చంద్రబాబు ఎన్నికల్లో గెలిచేందుకు ఎన్నో హామీలిస్తాడని, ఏదీ అమలు చేయడని చెప్పారు. తోడేళ్ల గుంపు మనపై దాడికి వస్తోందని, ఎదుర్కొనేందుకు, తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఒక్క జగన్ అనే వ్యక్తిని ఓడించేందుకు 30 పార్టీలు కలిసొచ్చినా భయపడేది లేదన్నారు. పరీక్షల్లో 99 మార్కులు తెచ్చుకునే విద్యార్ధి ఎప్పుడూ భయపడడని, పది మార్కులు వచ్చే విద్యార్ధే పరీక్షలంటే భయపడతాడని స్పష్టం చేశారు. అందుకే విలువలు, విశ్వసనీయతతో మరోసారి ఓటు అడగగలుగుతున్నామన్నారు. 


Also read: Congress First list: ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల, అవినాష్‌పై పోటీకు వైఎస్ షర్మిల



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook