Congress First list: ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల, అవినాష్‌పై పోటీకు వైఎస్ షర్మిల

Congress First list: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్దమైంది. వైఎస్ షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకునే ప్రయత్నంలో ఉంది. ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను ఏఐసీసీ విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 2, 2024, 05:22 PM IST
Congress First list: ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల, అవినాష్‌పై పోటీకు వైఎస్ షర్మిల

Congress First list: ఏపీలో ఇప్పటికే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి తమ తమ అభ్యర్ధుల్ని ప్రకటించాయి. వైఎస్ షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా114 అసెంబ్లీ, 5 లోక్‌సభ స్థానాలకు పేర్లు ఖరారయ్యాయి. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమయ్యాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలో దిగుతూ ఇప్పటికే అభ్యర్ధులందర్నీ ప్రకటించింది. ఇక తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమిగా ఏర్పడి తమ తమ అభ్యర్ధుల్ని వెల్లడించాయి. ఇక కొత్తగా వైఎస్ షర్మిల నేతృత్వంలో ఉనికి చాటుకునే ప్రయత్నంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో కలిసి బరిలో దిగుతోంది. ఇవాళ 5 లోక్‌సభ, 114 అసెంబ్లీ స్థానాలతో తొలి జాబితా ప్రకటించింది. 

కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసిన తొలి జాబితాలో కడప పార్లమెంట్ బరి నుంచి వైఎస్ షర్మిల పోటీ చేయనున్నారు. సోదరుడు అవినాష్‌కు వ్యతిరేకంగా షర్మిల తలపడనున్నారు. ఇక కాకినాడ నుంచి మాజీ కేంద్ర మంత్రి పళ్లంరాజు పోటీ చేస్తున్నారు. రాజమండ్రి పార్లమెంట్ నుంచి గిడుగు రుద్రరాజ, బాపట్ల నుంచి జేడీ శీలం, కర్నూలు నుంచి రాం పుల్లయ్య యాదవ్ బరిలో ఉంటారు. 

ఇక అసెంబ్లీకు సంబంధించి 114 మంది జాబితా విడుదలైంది. వీరిలో శింగనమల నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి శైలజానాధ్ బరిలో ఉంటారు. వైసీపీకు రాజీనామా చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్ధర్ నంది కొట్కూరు నుంచి, ఎలీజా చింతలపూడి నుంచి బరిలో ఉంటారు. ఇక కుప్పం నుంచి ఆవుల గోవందరాజుల పోటీ చేయనున్నారు. రాజమండ్రి సిటీ నుంచి బోడా లక్ష్మీ వెంకట ప్రసన్న, కాకినాడ సిటీ నుంచి చెక్కా నూకరాజు పోటీ చేస్తున్నారు. తణుకు నుంచి కడలి రామారావు, దెందులూరు నుంచి ఆలపాటి నర్శింహరాజు, మచిలీపట్నం నుంచి అబ్దుల్ మతీన్, గుంటూర్ ఈస్ట్ నుంచి షేక్ మస్తాన్ వలీ, నెల్లూరు రూరల్ నుంచి షేక్ ఫయాజ్, తాడిపత్రి నుంచి నాగిరెడ్డి బరిలో ఉన్నారు. 

మరోవైపు బీహార్‌లోని మూడు పార్లమెంట్, ఒడిశాలోని 8 పార్లమెంట్ స్థానాలకు కూడా అభ్యర్ధుల్ని ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. బీహార్‌లోని కృష్ణగంజ్ నుంచి మొహమ్మద్ జావేద్, కతియార్ నుంచి తారీఖ్ అన్వర్, బాగల్పూర్ నుంచి అజీత్ శర్మ బరిలో నిలుస్తున్నారు. 

Also read: School Holidays 2024: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. సమ్మర్ హలీడేస్ ప్రకటించిన ప్రభుత్వం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News