AP Omicron Update: కరోనా మహమ్మారి కొత్తరూపం ఒమిక్రాన్ వేరియంట్‌పై ఏపీ ప్రభుత్వం పూర్తి అప్రమత్తతతో వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో ఒమిక్రాన్ సోకిన తొలివ్యక్తి చికిత్స అనంతరం కోలుకున్నాడు. ఒమిక్రాన్ నెగెటివ్‌గా పరీక్షలో తేలింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా లేదని రాష్ట్ర ప్రభుత్వం (Ap Government)ప్రకటించింది. ఏపీలో ఈ వేరియంట్ నమోదైన తొలి వ్యక్తి కూడా ఒమిక్రాన్ నుంచి కోలుకున్నాడని అధికారులు తెలిపారు. పూర్తి హోం ఐసోలేషన్‌లో ఆ వ్యక్తి కోలుకున్నట్టు వైద్యలు చెప్పారు. ఐర్లాండ్ నుంచి ముంబై ఎయిర్‌పోర్టు‌కు, అక్కడి నుంచి తిరుపతి, విశాఖపట్నం ప్రాంతాలకు వెళ్లిన వ్యక్తిని గుర్తించి పరీక్షలు జరపగా కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. తదుపరి పరీక్షల కోసం హైదరాబాద్‌లోని జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు పంపించారు. అక్కడ ఆ పరీక్షలో ఒమిక్రాన్ వెలుగుచూడటంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అప్రమత్తమయ్యారు. అతడిని హోం క్వారెంటైన్‌లో ఉంచి చికిత్స అందించగా ఇప్పుడతను కోలుకున్నాడు. తిరిగి పరీక్షలు చేయగా నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో ఇప్పుడు ఒమిక్రాన్ కేసులు ఒక్కటి కూడా లేవని వైద్యులు స్పష్టం చేశారు. 


ఇక ఆ వ్యక్తితో కాంటాక్ట్ అయిన 40 మందికి కూడా పరీక్షలు నిర్వహించగా అందరికీ కోవిడ్ నెగెటివ్‌గా తేలింది. విదేశాల్నించి 15 వేలమంది రాష్ట్రానికి చేరుకోగా, వీరిలో 2 వేల 9 వందలమందిని గుర్తించగలిగారు. ఇందులో 15 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. తదుపరి పరీక్షలకై జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించగా..ఒక్కరికి మాత్రమే ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చింది. ఇప్పుడా వ్యక్తి కోలుకున్నాడు. అయితే మరో ఐదుగురి ఫలితాలు రావల్సి ఉంది. ఇక తిరుపతిలో ఓ వ్యక్తికి ఒమిక్రాన్‌గా తేలిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని వైద్య అధికారులు ఖండించారు. చిత్తూరు జిల్లాలో ఇప్పటివరకూ ఒక్క ఒమిక్రాన్ కేసు(Omicron Variant) కూడా నమోదవలేదని చెప్పారు. 


రాష్ట్రంలో కరోనా ఆంక్షల్ని విధిగా అమలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని..భౌతిక దూరం పాటించాలని  నిబంధనలు విధించారు. విదేశాల్నించి వచ్చే ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు చేస్తున్నారు. నెగెటివ్ వచ్చినా సరే..హోం క్వారెంటైన్‌లో ఉంచి వైద్య పరీక్షలు అందిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా లేదని ప్రకటించారు. 


Also read: Coonoor Helicopter Crash: స్వగ్రామానికి సాయితేజ పార్థివదేహం.. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాటు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook