Coonoor Helicopter Crash: తమిళనాడులోని కూనూరు సమీపంలో జరిగిన హెలికాప్టర్ దుర్ఘటనలో ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక మరణించారు. ఇదే ఘటనలో ప్రాణాలు కోల్పోయిన తెలుగు వ్యక్తి లాన్స్ నాయక్ సాయితేజ పార్థివదేహాన్ని ఆయన స్వగ్రామం చిత్తూరులోని ఎగువరేగడకు తరలించారు.
బెంగళూరులో సైన్యానికి చెందిన కమాండ్ ఆస్పత్రి నుంచి సాయితేజ భౌతికకాయాన్ని చిత్తూరు జిల్లా సరిహద్దు చీకలబైలు చెక్‌పోస్ట్.. వలసపల్లి మీదుగా ఎగువరేగడకు రోడ్డు మార్గంలో సుమారు 30 కి.మీ మేర భారీ ర్యాలీగా తీసుకెళ్తున్నారు.
Andhra Pradesh | Mortal remains of Lance Naik B Sai Teja, who lost his life in the military chopper crash on 8th Dec, brought to his hometown Chittoor pic.twitter.com/GPz8I3AMT6
— ANI (@ANI) December 12, 2021
ఈ ర్యాలీలో సాయితేజ బంధువులు, స్నేహితులు, పెద్ద ఎత్తున విద్యార్థులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సాయితేజ భౌతికకాయం ఎగువరేగడకు చేరిన అనంతరం సైనిక లాంఛనాలతో అక్కడ అంతిమ సంస్కారాలు పూర్తి చేయనున్నారు.
ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా..
అయితే తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సాయితేజ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ప్రభుత్వం తరఫున రూ.50 లక్షలను సాయి తేజ కుటుంబానికి అందజేయనున్నట్లు తెలిపారు.
Also Read: Breaking News: ఆంధ్రప్రదేశ్ లో తొలి ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదు
Also Read: Lance Naik Sai Teja's Body : బెంగళూరుకు చేరిన లాన్స్ నాయక్ సాయితేజ భౌతికకాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook