ఆంధప్రదేశ్ ప్రభుత్వం అర్హతగల వారికి గ్రామస్థాయిలో, గ్రామ సచివాలయం (Grama Sachivalayam ) ద్వారా రేషన్ కార్డులను, పెన్షన్, ఆరోగ్య శ్రీ కార్డులను ( YSR Aarogyasri cards) అందిస్తోంది. ఈ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోండటంతో, గ్రామ వాలంటీర్లు రెగ్యులర్ గా ప్రజలతో పాటు పైస్థాయి అధికారులతో కమ్యూనికేషన్ లో ఉండటంతో లబ్దిదారులకు కావాల్సిన పత్రాలు, పథకాలు త్వరగా అందు బాటులోకి వస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | YSR Badugu Vikasam: వైఎస్సార్ బడుగు వికాసం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్


ఈ సంవత్సరం సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 19 మధ్య కాలంలో అంటే 35 రోజుల్లో 6 లక్షల 11 వేల 824 రేషన్ కార్డులు జారీ చేశారు. అప్లై చేసిన పది రోజుల్లోనే  చాలా మందికి కార్డులు జారీ చేశారు.  ఇందులో 99 శాతం మందికి అప్లై చేసిన 35 రోజుల్లోనే లబ్దిదారులు చేతుల్లోకి కార్డులు చేరాయి. వాలంటీర్లు డైరక్ట్ గా వెళ్లి లబ్ది దారులకు కార్డులు అందజేశారు.


గత 35 రోజుల్లో 78,372 మంది వైఎస్సార్ పెన్షన్ ( YSR Pension ) కోసం అప్లై చేయగా వారికి పెన్షన్ ప్రాసెస్ పూర్తి చేశారు. ఇందులో అర్హులైన వారికి 10 రోజుల్లోనే పెన్షన్ గ్రాంట్ చేశారు. ఒక ఆరోగ్య శ్రీ కార్డు కోసం అప్లై చేసిన 38,830 మందికి 20 రోజుల్లోనే కార్డులను జారీ చేశారు. రేషన్ కార్డు, ఆరోగ్య కార్డులను నిర్ణీత సమయంలోనే అర్హులైన వారికి అందించాలి అని ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( YS Jagan Mohan Reddy ) అధికారులను సూచించారు. ఈ మేరకు గ్రామ సరివాయం, గ్రామ వాలంటీర్ల సహాయంతో లబ్దిదారులను ఇలా అండగా నిలుస్తున్నారు.



ALSO READ | Good News: ఒక్క రుపాయితో రూ.25 లక్షలు సంపాదించే అవకాశం


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR