AP Pensions Issue: రాష్ట్రంలో రేపట్నించి పింఛన్ల పంపిణీ, కొత్త విధివిదానాలు జారీ
AP Pensions Issue: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఏ నోట విన్నా పింఛన్ల ప్రస్తావనే విన్పిస్తోంది. ఎన్నిక సంఘం ఆదేశాల నేపధ్యంలో పింఛన్ల పంపిణీపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.
AP Pensions Issue: ఏపీలో ప్రతి నెలా 1వ తేదీ వచ్చేసరికి ఉదయం తెల్లవారుజామునే వృద్ధాప్య పెన్షన్లు చేతికి అందడం గత నాలుగున్నరేళ్లుగా జరుగుతోంది. కానీ ఈసారి ఎన్నికల కోడ్ కారణంతో ఆ ప్రక్రియకు విఘాతం ఏర్పడింది. దాంతో రాజకీయ దుమారం చెలరేగుతోంది. ప్రభుత్వం మాత్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది.
ఏపీలో తెలుగుదేశం మద్దతుదారుడుగా భావించే మాజీ ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం ఏపీలో పింఛన్లు సహా సంక్షేమ పధకాల అమలుకు వాలంటీర్లను దూరం చేస్తూ ఆదేశాలిచ్చింది. వాలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చిన సెల్ ఫోన్లు, ట్యాబ్‌లను స్వాధీనం చేసుకోమని సూచించింది. ఈ ఆదేశాలు వెలువడింది మార్చ్ 31న. దాంతో ఏప్రిల్ 1న జరగాల్సిన పింఛన్ల పంపిణీ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. మరోవైపు ఏప్రిల్, మే నెలల పింఛన్లు స్థానిక వార్డు, గ్రామ సచివాలయాల్లోకి వెళ్లి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
చాలామంది నడవలేని వృద్ధులకు ఇది సమస్యే. వైసీపీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం నిమ్మగడ్డ సహాయంతో ఫించన్లు అపించే ప్రయత్నం చేసిందని ఆరోపిస్తోంది. దాంతో తెలుగుదేశం డిఫెన్స్‌లో పడిపోయింది. ఫించన్లు ఇంటింటికీ పంపిణీ చేయాలంటూ మాట్లాడుతోంది. ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం పింఛన్ల పంపీణీకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. రేపు అంటే ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 6 వరకూ నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ చేపట్టనుంది.
పింఛన్ల పంపిణీకు సంబంంధించి కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. సిబ్బంది కొరత కారణంగా రెండు విధానాల్లో పింఛన్లు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారికి మాత్రం ఇంటి వద్దకే పింఛన్లు పంపిణీ చేయనుంది. మిగిలినవారికి గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిణీ చేయనుంది. ఉదయం 9 గంటల్నించి రాత్రి 7 గంటల వరకూ ఈ నాలుగు రోజులు సచివాలయాలు పనిచేసేలా ఆదేశాలు జారీ అయ్యాయి. గ్రామ, సచివాలయాల్లోని 1.27 లక్షల సిబ్బందితో రేపట్నించి నాలుగు రోజులపాటు పింఛన్లు పంపిణీ కానున్నాయి.
Also read: AP Elections 2024: వైఎస్ జగన్ టార్గెట్ మారిందా, ఇప్పుడు వైనాట్ 175 కాదా, జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook